ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్.. అమెజాన్ సి‌ఈ‌ఓ డౌన్.. కారణం ఏంటంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jan 08, 2021, 10:58 AM IST
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్.. అమెజాన్ సి‌ఈ‌ఓ డౌన్.. కారణం ఏంటంటే ?

సారాంశం

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలోన్ మస్క్ కదలిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే నవంబర్ లో బిల్ గేట్స్ ను దాటి ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడిగ ఎలోన్ మస్క్ అవతరించాడు. 

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ల వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఎలోన్ మస్క్ మొత్తం నికర విలువ 188 బిలియన్ డాలర్లు. 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వాల్యుయేషన్ ప్రకారం  ప్రపంచంలోనే అగ్ర 500 ధనవంతుల జాబితాలో ఎలోన్ మస్క్ ఇప్పుడు అమెజాన్  సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు, 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అక్టోబర్ 2017 తరువాత జెఫ్ బెజోస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కానీ ఈ ఏడాది జెఫ్ బెజోస్ ని అధిగమించి ఎలోన్ మస్క్ అత్యంత సంపన్నుడిగా అవతరించడం మొదటిసారి.

జెఫ్ బెజోస్ ప్రస్తుతం  187 బిలియన్ల నికర విలువతో రెండవ స్థానంలో ఉన్నాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ గత కొన్ని నెలలుగా మార్కెట్ పరిస్థితుల కారణంగా అతని సంపద కొద్దిగా హెచ్చుతగ్గులకు గురైంది.

also read ఇండియాలోని ఫేమస్ సెలిబ్రిటీల మొదటి కార్లు: సచిన్ టెండూల్కర్ నుండి కత్రినాకైఫ్ వరకు వాడిన కార్లు ఇవే....

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలోన్ మస్క్ కదలిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే నవంబర్ లో బిల్ గేట్స్ ను దాటి ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడిగ ఎలోన్ మస్క్ అవతరించాడు. ప్రపంచంలోని చాలా భాగం 2020లో కరోనా సంక్షోభానికి గురైనప్పటికీ, ఎలోన్ మస్క్ వ్యక్తిగతంగా 2020లో తన విలువను 150 బిలియన్ డాలర్లకు పైగా పెరుగుదల నమోదైంది.


ఎలోన్ మస్క్ ఎలా స్పందించాడు
టెస్లా స్పేస్‌ఎక్స్ వంటి అనేక వినూత్న సంస్థల వ్యవస్థాపకుడైన ఎలోన్ మస్క్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచినందుకు వింతగా స్పందించాడు. "టెస్లా ఓనర్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ" అనే ఖాతా నుండి ట్యాగ్ చేసిన ట్వీట్‌కు ఎలోన్ మస్క్  టెక్స్ట్‌తో స్పందిస్తూ, "హౌ స్ట్రేంజ్" అని రిప్లయ్ చేశాడు. 

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ 
ఎలోన్ మస్క్ సంపద పెరగడానికి ప్రధాన కారణం టెస్లా షేర్ల పెరుగుదల, ఇది ఇటీవల 4.8 శాతం ర్యాలీ చేసి, ఎలాన్ మస్క్  విలువను బెజోస్ బెజోస్ నికర విలువ కంటే మించిపోయింది. గత 12 నెలలలో ఎలాన్ మస్క్ మొత్తం నికర విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా పెంచింది.
 

PREV
click me!

Recommended Stories

Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి