మహిళా కారుపై రతన్ టాటా కార్ నంబర్ ప్లేట్.. ట్రాఫిక్ చలాన్ తో బయటపడ్డ ఆసక్తికరమైన సంఘటన..

By S Ashok Kumar  |  First Published Jan 6, 2021, 6:53 PM IST

ముంబై పోలీసులు ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘన కారణంగా దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చలాన్ పంపించడంతో ఈ విషయం వెల్లడైంది.


ముంబైలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైకి  చెందిన  ఒక మహిళ రతన్ టాటా కారు నంబర్ ప్లేట్ ఉపయోగించి తన కారును నడుపుతోంది. ముంబై పోలీసులు ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘన కారణంగా దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చలాన్ పంపించడంతో ఈ విషయం వెల్లడైంది. 

 ఈ కేసులో నిందితురాలు రతన్ టాటా కారు నంబర్ ప్లేట్‌ను తన కారుపై ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళా కారు నంబర్ ప్లేట్ రతన్ టాటా కారు నంబర్ ప్లేట్ MH01 DK 0111 ఒకేలా ఉన్నాయని తనకు తెలియదని మహిళ వెల్లడించింది.

Latest Videos

కొంతమంది జ్యోతిష్కులు తన కారు కోసం ప్రత్యేక నంబర్ ప్లేట్ ఉపయోగించమని సలహా ఇచ్చారని, అందువల్ల ఆ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తోందని మహిళ పోలీసులకు తెలిపింది. ఈ విషయంలో నిందితురాలు మహిళ కాబట్టి, తనని రాత్రివేళ  పోలీస్‌స్టేషన్‌కు పిలవలేదని పోలీసులు తెలిపారు. 

also read 

తరువాత రోజున మహిళను బుధవారం ప్రశ్నించడానికి పోలీసులు పిలిపించి విచారించారు. విచారించిన తరువాత  నిందితురాలైన మహిళపై పోలీసులు ఐపిసి 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు రతన్ టాటాకు జరిమానా విధించినప్పటికీ అతను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదని పోలీసులు తెలిపారు.

రతన్ టాటా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదని టాటా గ్రూప్ అధికారులు స్పష్టం చేయడంతో ఈ విషయం తెలిసింది. పోలీసులు కారును మాతుంగా పోలీస్ స్టేషన్ వద్ద స్వాధీనం చేసుకొని మహిళను అలాగే ఆమె సంస్థపై కేసు నమోదు చేశారు.

జ్యోతిషశాస్త్ర సంఖ్యలను సద్వినియోగం చేసుకోవడానికి నిందితురాలు ఒరిజినల్ నంబర్ ప్లేట్‌ను మార్చడం ద్వారా తన కారుపై నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగించిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. రతన్ టాటా కారుకు పంపిన ఇ-చలాన్ లు అన్నీ ఇప్పుడు నిందితురాలు కారుకి బదిలీ చేయబడ్డాయి అని చెప్పారు.  

ఇండియన్ మోటారు వాహనాల చట్టం ప్రకారం, 2019 సెప్టెంబర్ నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, అనుమతి లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి రూ .10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష కూడా విధించనుంది.  

click me!