కరోనా కంటే ముందే ఆ సమస్యల్లో ఆటోమొబైల్ రంగం: సియామ్

By Sandra Ashok KumarFirst Published Jul 15, 2020, 12:58 PM IST
Highlights

ఆటోమొబైల్స్ రంగం రెండు దశాబ్దాల్లో గతంలో ఎన్నడు లేని విధంగా కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిజానికి కరోనాకు ముందే ఆటోమొబైల్ రంగం ఆర్థిక మందగమనంతో సమస్యల్లో చిక్కుకున్నది. లాక్​డౌన్ తర్వాత మరింత సంక్షోభంలో కూరుకున్నదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్యాసింజర్ కార్ల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో 78,43%, వాణిజ్య వాహనాల అమ్మకాలు 84.81% తగ్గాయి. 

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న అనిశ్చితి ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. కరోనాకు ముందే వాహన రంగం ఆర్థిక మంద గమనాన్ని ఎదుర్కొన్నది. కరోనాతో ఇప్పుడు మరింత సంక్షోభంలోకి జారుకున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పట్లో ఆటోమొబైల్ విక్రయాల్లో నెలకొన్న అనిశ్చితి ఇప్పట్లో తొలిగే సంకేతాలు కనిపించడం లేదని సియామ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ ప్యాసిజర్ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయని వాహన తయారీ పరిశ్రమల విభాగం 'సియామ్' వెల్లడించింది. ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగా 78.43 శాతం పడిపోయాయి.

ఏప్రిల్ నెలలో సంపూర్ణ లాక్​డౌన్ ఉండటం ఇందుకు ప్రధాన కారణమని సియామ్ పేర్కొన్నది. గత 20 ఏళ్లలో ఇదే సుదీర్ఘ మందగమనమని సియామ్ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 1,53,734 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే విక్రయమయ్యాయి. 

also read ముంబై ట్రాఫిక్ కోసం ఈ వాహనం పర్ఫెక్ట్ : ఆనంద్ మహీంద్రా ...

2019 ఇదే సమయంలో 7,12,684 వాహనాలు అమ్ముడు అయ్యాయి. గతంలో 2013-14, 2014-15 మధ్య, 2000-01 నుంచి 2001-02 మధ్య ఐదు త్రైమాసికాల్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు పడిపోయాయి.

ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు అత్యధికంగా 84.81 శాతం పడిపోయాయి. ఈ మూడు నెలల్లో 31,636 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 ఇదే త్రైమాసికంలో 2,08,310 వాహనాలు విక్రయించాయి.

2020 ఏప్రిల్ జూన్​ త్రైమాసికంలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ద్విచక్ర వాహనాల విక్రయాలు 75.21 శాతం క్షీణతతో 50,13,067 వాహనాల నుంచి 12,93,113 వాహనాలకు పడిపోయాయి.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో త్రిచక్ర వాహనాల విక్రయాలు 91.48 శాతం తగ్గాయి. 12,760 త్రీ చక్ర వాహనాలు మాత్రమే విక్రయం అయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 1,49,797 యూనిట్లు అమ్ముడుపోయాయి.

click me!