ముంబై ట్రాఫిక్ కోసం ఈ వాహనం పర్ఫెక్ట్ : ఆనంద్ మహీంద్రా

By Sandra Ashok KumarFirst Published Jul 14, 2020, 7:16 PM IST
Highlights

ముంబై నగరంలో  డ్రైవింగ్ చేయడం అంటే అంత తేలికైన పని కాదు. ట్రాఫిక్ విషయానికి వస్తే బెంగళూరు తరువాత రెండవ స్థానంలో ముంబై నగరం ఉంటుంది. 

దేశంలో రద్దీగా ఉండే  ప్రముఖ నగరాలలో ముంబై ఒకటి. అలాంటి ముంబై నగరంలో  డ్రైవింగ్ చేయడం అంటే అంత తేలికైన పని కాదు. ట్రాఫిక్ విషయానికి వస్తే బెంగళూరు తరువాత రెండవ స్థానంలో ముంబై నగరం ఉంటుంది. ఎందుకంటే ముంబై రోడ్లపై ఉండే భారీ ట్రాఫిక్, ఇంకా తక్కువ దురానికి కూడా ఎక్కువ ప్రయాణ సమయాలకు ముంబై ప్రసిద్ది చెందింది.

అదృష్టవశాత్తూ ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ముంబై ట్రాఫిక్ సమస్యలకు సరైన పరిష్కారం కనుగొన్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు, ఇది చట్టబద్ధంగా ఉండకపోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం ఆనంద్ మహీంద్రా తన సంస్థ రూపొందించి, నిర్మించిన ఒక ప్రత్యేక వాహనం సంభంధించి రెండు ఫోటోలను ట్విట్టర్‌  ద్వారా షేర్ చేశారు.

ఈ ఫోటోలను మొట్టమొదటీగా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్ లో మహీంద్రా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్ గ్రూప్ ప్రెసిడెంట్, సిఇఒ ఎస్‌పి శుక్లా పోస్ట్ చేశారు. తన పోస్టులో "# మహీంద్రా డిఫెన్స్ 'మైన్ రెసిస్టెంట్ అంబుష్ ప్రొటెక్టెడ్' స్పెషాలిటీ వాహనాలను ఇంటరాగేషన్‌తో రూపకల్పన చేసి, ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసినందుకు గర్వంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు.

ఇది రోడ్ పక్కన అమర్చిన ఐ‌ఈ‌డి లను(పేలుడు పరికరాలను) ఎత్తడానికి ఉపయోగిస్తారు. పేలుడు పరికరాలను తీయటానికి ఉపయోగపడే ఈ వాహనాలు యునైటెడ్ నేషన్స్ దేశ శాంతి పరిరక్షక కార్యకలాపాలకు సహాయపడతాయి.

also read 

65 ఏళ్ల ఆనంద్ మహీంద్రా తన కంపెనీ సాధించిన ఈ గొప్ప విజయాన్ని ట్విట్టర్‌ ద్వారా షేర్ చేస్తూ అభినంధించారు. ఈ వాహనాన్ని "మీన్ మెషిన్" అని కూడా ప్రశంసించారు. "ఇది #మహీంద్రా డిఫెన్స్ నిజమైన స్ఫూర్తిని కలిగి ఉంటుంది, ఇది శాంతి పరిరక్షకులను సురక్షితంగా ఉంచడం" అని ఆయన రాశారు.

"ముంబై ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడానికి ఇది సరైనది అనుకుంటా" అని ఆనంద్ మహీంద్రా చమత్కరించారు. తాను చేసిన ఈ ట్వీట్ కి 9,000 'లైక్స్', వెయ్యికి పైగా కామెంట్స్ కూడా వచ్చాయి. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు కామెంట్స్ విభాగంలో ఈ వాహనాన్ని ప్రశంసించారు.

ఆనంద్ మహీంద్రా ముంబైకి ట్రాఫిక్ కి ఇది ప్రత్యేకమైన వాహనం అని అన్నపుడు మీకు తమాషాగా ఉండవచ్చు, కానీ ముంబై నగరంలోని చాలా మంది నివాసితులకు ఉండే నిజమైన సమస్య అక్కడి ట్రాఫిక్. ఐడిఎఫ్‌సి ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం, ముంబైలో పుట్టి, నివసించే వారు సంవత్సరానికి సగటున 260 గంటల పాటు (సుమారు 11 రోజూలు అన్నమాట) ట్రాఫిక్‌లోనే గడిపేస్తున్నారు.

click me!