బీఎండబ్ల్యూ కొత్త బైక్‌.. 3 సెకన్లలో 100 స్పీడ్..

Ashok Kumar   | Asianet News
Published : Jul 17, 2020, 10:47 AM ISTUpdated : Jul 17, 2020, 10:42 PM IST
బీఎండబ్ల్యూ కొత్త  బైక్‌.. 3 సెకన్లలో 100 స్పీడ్..

సారాంశం

 బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ పేరుతో గురువారం లాంచ్‌ చేసింది. ఈ అడ్వెంచర్ స్పోర్ట్ బైక్ ధర 20.9 లక్షల రూపాయలగా నిర్ణయించింది. తమ డీలర్ నెట్‌వర్క్‌లో గురువారం నుంచి పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (సీబీయు)గా  ఈ బైక్‌ను ఆర్డర్ చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ  ద్విచక్ర వాహన సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ గురువారం అడ్వెంచర్ స్పోర్ట్ బైక్ సరికొత్త వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

దీని ధర రూ .20.9 లక్షలు. కొత్త బైక్‌ను బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియా డీలర్ నెట్‌వర్క్‌లో గురువారం నుంచి పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (సిబియు) గా ఆర్డర్ చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

also read వాష్‌బేసిన్, శానిటైజర్, వైఫైతో ఆనంద్ మహీంద్రను ఆశ్చర్యపరిచిన ముంబై ఆటొ.. ...

కొత్త 999 సిసి నాలుగు సిలిండర్ ఇన్-లైన్ ఇంజిన్‌తో నడిచే బి‌ఎం‌డబల్యూ ఎస్1000 ఎక్స్‌ఆర్, 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 165 హెచ్‌పి ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గంటకు 0-100 కి.మీ కేవలం 3.3 సెకన్లలో చేసుకోగలదు. అంటే గంటకు 200 కి.మీ ప్రయానించవచ్చు.

ఈ బైక్ కొత్త సస్పెన్షన్ సిస్టమ్ కలిగి ఉంది, ఇది పాత మోడల్ తో పోలిస్తే రైడింగ్ డైనమిక్స్ను పెంచడానికి ఇంజనీరింగ్ చేయబడింది అని కంపెనీ తెలిపింది. బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్‌లో తొలిసారిగా డైనమిక్ బ్రేక్ అసిస్టెంట్ డిబిసి (డైనమిక్ బ్రేక్ కంట్రోల్)ప్రవేశపెట్టారు.  ఇది బ్రేకింగ్ సమయంలో రైడర్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి
Maruti Grand Vitara : ఈ స్టైలిష్ కారును ఇప్పుడే కొంటే.. ఏకంగా రూ.2.19 లక్షల డిస్కౌంట్