టెస్లా సెమీ ట్రక్కులు పనిచేయవు.. వేరే మార్గం అవసరం : బిల్ గేట్స్

Ashok Kumar   | Asianet News
Published : Sep 08, 2020, 12:52 PM IST
టెస్లా సెమీ ట్రక్కులు పనిచేయవు.. వేరే మార్గం అవసరం : బిల్ గేట్స్

సారాంశం

అయితే దీనిలో బ్యాటరీలు పెద్దవిగా, భారీగా ఉన్నందున టెస్లా ఎలక్ట్రిక్ సెమీ ట్రక్కులు ఆశించినంతగా పనిచేయవని సూచించారు. ప్రపంచంలోని రెండవ ధనవంతుడు అయిన బిల్ గేట్స్ పెద్ద వాహనాలకు ఎక్కువ బ్యాటరీలను మరింత శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు ఇవి సరిపోవని అన్నారు. 

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కంపెనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్లా కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ ట్రక్కులను తయారు చేస్తుంది. అయితే దీనిలో బ్యాటరీలు పెద్దవిగా, భారీగా ఉన్నందున టెస్లా ఎలక్ట్రిక్ సెమీ ట్రక్కులు ఆశించినంతగా పనిచేయవని సూచించారు.

ప్రపంచంలోని రెండవ ధనవంతుడు అయిన బిల్ గేట్స్ పెద్ద వాహనాలకు ఎక్కువ బ్యాటరీలను మరింత శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు ఇవి సరిపోవని అన్నారు. 18 టైర్ల కార్గో ట్రక్కులకు, భారీగా ఉండే వాహనాలకు నిజంగా చాలా బ్యాటరీలు అవసరమవుతాయి అని అన్నారు.

"బ్యాటరీలు పెద్దవిగా, భారీగా ఉండటం వల్ల  ఎక్కువ బరువును తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బ్యాటరీలు మీ వాహనానికి సరిపడే శక్తినివ్వాలి. ఒకవేళ మీరు ఎక్కువ బ్యాటరీలను ఉపయోగిస్తే, ఎక్కువ బరువును తరలించడానికి ప్రయత్నిస్తారు.

also read కొత్త టాటా నెక్సాన్ అమ్మకాలు రెట్టింపు.. ఇండియాలో బెస్ట్ సెల్లర్ గా టాటా మోటార్స్..

మీకు ఎక్కువ శక్తి అవసరం ఉన్న బ్యాటరీ టెక్నాలజి ఉన్నప్పటికీ 18-టైర్ల  ఎలక్ట్రిక్ వాహనాలు, కార్గో షిప్స్, ప్యాసింజర్ జెట్ వంటి వాటికి ఇది పరిష్కారం కాదు.

మీరు తక్కువ దూరాన్ని ప్రయనించడానికి విద్యుత్తు బ్యాటరీలు పనిచేస్తాయి, కాని భారీ వాహనాలకు, ట్రక్కులకు వేరే పరిష్కారం అవసరం అని తన సొంత వెబ్‌సైట్‌లోని బ్లాగ్ పోస్ట్‌లో బిల్ గేట్స్ పేర్కొన్నాడు.

ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ తయారీదారు క్వాంటమ్‌స్కేప్‌లో పెట్టుబడుల విషయం వెల్లడైన తరువాత బిలియనీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాటరీలు 400 కిలోవాట్ల సామర్థ్యానికి చేరుకున్న తర్వాత అవి ఎలక్ట్రిక్ విమానాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ అంచనా వేసిన సంగతి మీకు తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Maruti Grand Vitara : ఈ స్టైలిష్ కారును ఇప్పుడే కొంటే.. ఏకంగా రూ.2.19 లక్షల డిస్కౌంట్
MG hector facelift: మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ల‌గ్జ‌రీ కారు.. అందుబాటు ధ‌ర‌లో MG హెక్ట‌ర్ కొత్త కారు