జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా ఐదేళ్ల క్రితం నాటి ఫార్చూనర్ కారును అప్ డేట్ చేసి తాజాగా గురువారం థాయిలాండ్ లో ఆవిష్కరించింది. దీన్ని భారత మార్కెట్లో వచ్చే ఏడాది ఆవిస్కరించనున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ: జపాన్ మల్టీ నేషనల్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ టొయోటా తాజాగా ఫార్చునర్ కార్ లేటెస్ట్ అప్‌డేట్‌ను రివీల్ చేసింది. ఫార్చునర్‌ను విపణిలోకి విడుదల చేసిన తర్వాత దాదాపు ఐదేళ్లకు కొత్త డెవలప్‌మెంట్ అయిన 2020 ఫేస్‌లిఫ్ట్‌ను థాయ్‌లాండ్‌లో గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది భారత విపణిలో విడుదల చేయనున్నదని తెలుస్తున్నది.
ఈ లేటెస్ట్ వెర్షన్ ఫార్చూనర్ మడల్ కారుకు ఔట్‌సైడ్ కొన్ని స్టైలింగ్ అప్‌గ్రేడ్స్‌ను టయోటా జత చేసింది. అలాగే క్యాబిన్‌లో కొన్ని ఎక్విప్‌మెంట్స్‌ను రివైజ్ చేయడంతోపాటు మరింత పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్‌తో దీనిని రూపొందించింది.
undefined
థాయ్‌లాండ్‌తోపాటు మరికొన్ని మార్కెట్లలో టొయోటా ఫార్చునర్‌కు మంచి మార్కెట్ ఉంది. టయోటా కొత్తగా తీసుకొచ్చిన అప్‌గ్రేడెడ్ ఫార్చునర్ మోడల్‌లో ముందు భాగంలో గ్రిల్, బంపర్ డిజైన్, హెడ్ లైట్స్‌ను పూర్తి కొత్తగా రూపొందించింది. వీటితో ఎస్‌యూవీకి మరింత సొబగులు అద్దినట్లయింది. రేర్ ఎల్‌ఈడీ లైట్స్‌ను కాస్తంత మేకోవర్ చేసింది.
టొయోటా ఫార్చునర్‌లో స్పోర్టియర్ వేరియంట్‌ను కూడా విడుదల చేయనుంది. దీంట్లో స్ప్లిట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా వైవిధ్యంగా ఉంది. దీన్ని గ్లాస్ బ్లాక్ ఫినిష్‌తో తయారు చేయడం విశేషం.
also read కరోనా కష్టకాలంలో రెనాల్ట్ ఉద్యోగులకు వరాలు, ప్రమోషన్లు..
ఫేస్‌లిఫ్ట్ ఇన్‌సైడ్ క్యాబిన్‌లో పెద్దగా ఉండేలా 8 ఇంచుల టచ్‌స్క్రీన్‌ను టొయోటా అమర్చింది. ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. సెవెన్ ఎయిర్‌బ్యాగ్స్ ను అన్ని వేరియంట్స్‌లోనూ ఇస్తున్న టొయోటా.. ఇండియాలో వచ్చే ఏడాది ఫార్చునర్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
19 లక్షల నిస్సాన్ కార్లు కాల్ బ్యాక్
నిస్సాన్ నాలుగోసారి తన కార్లను రీకాల్ చేసింది. అమెరికా, కెనడాలలో లక్షల సంఖ్యలో ఉన్న మధ్యస్థాయి కార్లను రీ కాల్ చేసింది. కారు కదిలే సమయంలో లాచ్- సమస్య వల్ల బాయ్ నెట్ (హుడ్) తెరుచుకోవడానికి కారణం అవుతుంటంతోనే దీన్ని రీకాల్ చేసింది.
2013-18 మధ్య విడుదలైన ఆల్టిమా మోడల్ కార్లలో ఈ సమస్య తలెత్తింది. దీంతో సంబంధిత కార్ల యజమానులకు ఆ కార్లను వెనక్కు పంపాల్సిందిగా కోరుతూ లేఖలు రాసింది. గతంలోనూ అంటే 2014, 2015, 2016ల్లోనూ వివిధ కారణాలతో నిస్సాన్ తన కార్లను రీ కాల్ చేసింది.