రూ.4లకే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ: షామీ బంపర్ ఆఫర్

Published : Jul 09, 2018, 06:49 PM IST
రూ.4లకే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ: షామీ బంపర్ ఆఫర్

సారాంశం

షామీ కంపెనీ తన నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజుల పాటు పలు రకాల తమ కంపెనీ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇండియాలో షామీ తన ఉత్పత్తులను ప్రారంభించి జూలై 10 వతేదీకి 4 ఏళ్లు అవుతోంది.


న్యూఢిల్లీ: ఎంఐ నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రెండురోజుల పాటు ఈ ఆఫర్లను కొనసాగిస్తామని షామీ ప్రకటించింది. రూ.4లకే ఎల్ఈడీ స్మార్ట్ టీవీని అందించనున్నట్టు షామీ ప్రకటించింది.

బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్సరీస్‌లతో దేశీయంగా షామీ కంపెనీ తన మార్కెట్ ను విస్తృతం చేసుకొంటుంది. జూన్ 10వ తేదీకి ఇండియా మార్కెట్లోకి షామీ అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తవుతోంది. దీంతో ప్రత్యేక ఆఫర్లను షామీ ప్రకటించింది.  జూలై 10 నుండి 12 వ తేదీ వరకు  ఈ ఆఫర్లను కొనసాగించనున్నట్టు షామీ ప్రకటించింది. 

ఎంఐ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రూ.4కే ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ4(55అంగుళాలు), రెడ్‌మి వై2, రెడ్‌మి నోట్‌5 ప్రో, ఎంఐ బ్యాండ్‌2లను ఫ్లాష్‌సేల్‌ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇక ఎంఐ మిక్స్‌2, ఎం మ్యాక్స్‌‌2లపై రాయితీని అందిస్తోంది. ఎస్‌బీఐ, పేటీఎం, మొబిక్విక్‌ల ద్వారా చెల్లింపులు చేసేవారు అదనంగా ఇంకొంత రాయితీని పొందవచ్చు.

ఎస్‌బీఐ కార్డు ద్వారా కనీసం రూ.7,500 లావీదేవీపై రూ.500 రాయితీ అందిస్తోంది. రూ.8,999 కొనుగోలుపై పేటీఎం ద్వారా చెల్లింపు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,000, సినిమా టికెట్లపై రూ.200 రాయితీ పొందవచ్చు. జులై 10 నుంచి 12వ తేదీ వరకూ ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు షామీ రూ.4 ఫ్లాష్‌సేల్‌ నిర్వహిస్తుంది. వీటితో పాటు కొన్ని ఉత్పత్తులపై ప్రత్యేక రాయితీని అందిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Credit Card: మీకు క్రెడిట్ కార్డు ఉందా.? జ‌న‌వ‌రి నుంచి మార‌నున్న రూల్స్‌, బాదుడే బాదుడు
Gold : బంగారం పై అమెరికా దెబ్బ.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?