ఎక్స్ (ట్విట్టర్) ఇండియా పాలసీ హెడ్ రాజీనామా .. కార్పోరేట్ వర్గాల్లో కలకలం, కారణమిదేనా..?

By Siva Kodati  |  First Published Sep 23, 2023, 7:15 PM IST

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఇండియా , సౌత్ ఏషియా పాలసీ అధిపతి సమీరన్ గుప్తా ఆ సంస్థకు షాకిచ్చారు. వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న వేళ ఎక్స్‌లో ఓ అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్ వైదొలగడం కార్పోరేట్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఇండియా , సౌత్ ఏషియా పాలసీ అధిపతి సమీరన్ గుప్తా ఆ సంస్థకు షాకిచ్చారు. తన పదవికి ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎక్స్‌కు ఇండియాలో కోర్టు వివాదాలు, వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న వేళ ఎక్స్‌లో ఓ అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్ వైదొలగడం కార్పోరేట్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది ఫిబ్రవరిలో సమీరన్ గుప్తా ఎక్స్‌లో చేరారు. అంతకుముందు ఇంటర్నెట్ కార్పోరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్‌లో ఆయన కీలక హోదాల్లో పనిచేశారు. 

ఎక్స్‌లో చేరిన తర్వాత కీలకమైన కంటెంట్ సంబంధిత విధాన సమస్యలను సమీరన్ పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో కంటెంట్ తొలగింపు విషయంలో ఎక్స్, భారత ప్రభుత్వం మధ్య ప్రస్తుతం న్యాయ పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు మార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కంటెంట్ తొలగించాల్సిందిగా సూచనలు వచ్చినా ఎక్స్ దీనిని పట్టించుకోలేదు. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ వుండటం, ఎక్స్‌‌పై భారత ప్రభుత్వం గట్టి నిఘా పెట్టిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనల నేపథ్యంలోనే సమీరన్ గుప్తా తన పదవికి రాజీనామా చేసి వుండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

Latest Videos

click me!