World’s Richest Kid: 9 సంవత్సరాల వయస్సులో బిలియనీర్, అతని లగ్జరీ లైఫ్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Ashok Kumar   | Asianet News
Published : Feb 14, 2022, 04:14 PM ISTUpdated : Feb 14, 2022, 04:18 PM IST
World’s Richest Kid: 9 సంవత్సరాల వయస్సులో బిలియనీర్, అతని లగ్జరీ లైఫ్ చూస్తే  ఆశ్చర్యపోతారు..

సారాంశం

ముహమ్మద్ అవల్ ముస్తఫా ఆకా మోంఫా జూనియర్ ది రిచీ రిచ్ లైఫ్ కి మరోపేరు.  ఎందుకంటే అతను ఆరేళ్ల వయసులో  సొంత భవనం, లగ్జరీ కార్లు  సొంతం చేసుకున్నాడు, ఇది చాలా మంది జీవితకాలంలో నిర్వహించలేనిది!

చిన్నతనం నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడిపే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే దీని వెనుక చాలా మంది తల్లితండ్రుల ఎంతో కృషి ఉంటుంది. కొందరు ఇంతటి గొప్ప స్థాయికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టేది, కానీ ఒక పిల్లవాడు 9 సంవత్సరాల వయస్సులోనే ఈ స్థానాన్ని సాధించాడు. ఇప్పుడు చిన్నారి ఆఫ్రికా(africa)లోనే అత్యంత సంపన్న పిల్లాడిగా అవతరించాడు. ఈ పిల్లడికి 9 సంవత్సరాల వయస్సులో  భారీ సంపద ఉంది, దాని గురించి  తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.  

9 సంవత్సరాల వయస్సులో  చాలా మంది పీల్లలకి బిలియన్ అంటే ఎంతో కూడా పెద్దగా తెలియదు. అయితే అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా!  అయితే 9 ఏళ్ల ఈ నైజీరియన్ (nigerian)పిల్లవాడు అతని విలాసవంతమైన లైఫ్ స్టయిల్ కారణంగా 'ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్'గా (billionaire)పేరు పొందాడు. అతనే ముహమ్మద్ అవల్ ముస్తఫా ఆకా మోంఫా (Mompha )జూనియర్, ఇప్పుడు  ఇతను రిచీ రిచ్ జీవితాన్ని గడుపుతున్నాడు, అతను ఆరేళ్ల వయసులో   భవనాన్ని(mansion) సొంతం చేసుకున్నాడు, ఇది చాలా మంది జీవితకాలంలో నిర్వహించలేనిది! అంతే కాదు మోంఫా ఒక ప్రైవేట్ జెట్‌లో  ప్రపంచం మొత్తం కూడా ప్రయాణిస్తాడు, ఇంకా అతనికి ఇతర ప్రదేశాలలో ఖరీదైన భవనాలను కూడా ఉన్నాయి  మరోవైపు  అతనికి సూపర్ కార్ల కలెక్షన్ కూడా ఉంది అని ఒక నివేదిక నివేదించింది. 
  కేవలం 9 ఏళ్లకే అపార సంపదకు యజమానిగా మారిన ఆఫ్రికా ధనవంతురాడైన మోంఫా జూనియర్ బ్రాండెడ్ బట్టలు, గడియారాలు, బూట్లు  ధరిస్తాడు.  

 ఈ బిలియనీర్ కిడ్ మోంఫా జూనియర్ నైజీరియాలోని లాగోస్ నివాసి. ఈ సంపన్నుడి తండ్రి నైజీరియన్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాలియా ముస్తఫా. మోన్ఫా జూనియర్‌కు అతని తండ్రి ఇస్మాలియా ముస్తఫా 6 సంవత్సరాల వయస్సులో వెండి రంగు బెంట్లీ(bently) కారును బహుమతిగా ఇచ్చారు.  ఇన్‌స్టాగ్రామ్(instagram) లో మోంఫాను 1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. మోంఫా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతని లగ్జరీ లైఫ్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి ఇంకా కొడుకు ఇద్దరి ప్రైవేట్ జెట్‌లు, లగ్జరీ కార్లు, బంగ్లాల ఫోటోలను చూడవచ్చు. డిజైనర్ దుస్తులను మాత్రమే ధరించే మోంఫా జూనియర్‌కు వెర్సాస్ అండ్ గూచీ వంటి బ్రాండ్‌లు చాలా ఇష్టం. అతను తన తండ్రి నుండి బహుమతిగా పొందిన లగ్జరీ కార్లు ఒకటి కంటే ఎక్కువే ఉన్నాయి. ఇస్మాలియా ముస్తఫాకు దుబాయ్ ఇంకా నైజీరియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇల్లులు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?