కోటీశ్వరులు అవ్వడమే మీ లక్ష్యమా అయితే మీ ఆర్థిక ప్రణాళికను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఒక కోటి రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి బెంచ్ మార్క్ సంపాదన అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక కోటి రూపాయలు ఉంటే చాలు జీవితం సాఫీగా గడిచిపోతుందని భావించే మధ్యతరగతి ప్రజలు మన దేశంలో చాలామంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఒక కోటి రూపాయల విలువ తగ్గిపోతున్నప్పటికీ కోటీశ్వరుడు అనే పేరుకి విలువ మాత్రం తగ్గడం లేదు. అందుకే మీ జీవితంలో మొదటి కోటి రూపాయలను ఎలా సంపాదించుకోవాలో . ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1 లక్ష నుండి 1 కోటి సంపాదించడానికి చాలా సమయం పడుతుందని మీరు భావిస్తూ ఉండవచ్చు. సంప్రదాయ పద్ధతిలో ప్రయత్నిస్తే..బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్, .పీపీఎఫ్, ఎన్‌పీఎస్ లలో పెట్టుబడి పెట్టినా 1 కోటి రూపాయలు సంపాదించడం కష్టమే. కానీ మీరు 1 లక్షను 1 కోటి చేసే సులువైన పద్ధతిని తెలుసుకుందాం. నేటి సాంప్రదాయ పద్ధతుల్లో డబ్బును కూడబెడితే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం చాలా కష్టం. నేటి కాలంలో ద్రవ్యోల్బణం 6.5 నుంచి 7 శాతంగా ఉంది. పైన పేర్కొన్న సాంప్రదాయ పద్ధతులు 8 నుండి 9 శాతం వరకు మాత్రమే రాబడిని ఇవ్వగలవు. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో, ఒక సాధారణ వ్యక్తి తన డబ్బు వేగంగా పెరగడానికి ఏ మార్గం ఎంచుకుంటే మంచిదో తెలుసుకుందాం
ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి
మీ వయస్సు 25 ఏళ్లు అయితే... మీరు రెండేళ్ళ క్రితమే సంపాదించడం మొదలుపెట్టారు, అనుకుందాం. అప్పుడు మీకు గోల్డెన్ ఛాన్స్ ఉంది. మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా 1 కోటి సంపాదించవచ్చు. మీరు 1 లక్ష మాత్రమే పెట్టుబడి పెడితే కోటి రూపాయలు సంపాదించవచ్చా అనే ఆలోచన రావచ్చు. కానీ ఇది అసాధ్యం మాత్రం కాదని కచ్చితంగా చెప్పవచ్చు. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ ఓ చక్కటి మార్గం అని చెప్పవచ్చు.
ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కలను మీరు సహకారం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద పెట్టుబడిదారు వారెన్ బఫెట్ కూడా ఇండెక్స్ ఫండ్‌ను ఉత్తమ ఫండ్‌గా పరిగణించారు.
మీరు ఏదైనా ఒక ఇండెక్స్ ఫండ్‌ని ఎంచుకుంటే. ఇండెక్స్ ఫండ్స్ సాధారణంగా దీర్ఘకాలికంగా 12 నుంచి 15 శాతం రాబడిని ఇస్తాయి. ఇప్పుడు మీ వయస్సు 25 సంవత్సరాలు అని అనుకుందాం మీరు ఏదైనా ఒక ఇండెక్స్ ఫండ్‌లో రూ. 1 లక్ష లంప్సమ్ (అంటే డబ్బును ఒకేసారి పెట్టడం) పెట్టారని అనుకుందాం.
మీరు మీ రూ. 1 లక్షను ఇండెక్స్ ఫండ్‌లో ఉంచి. మీ పదవీ విరమణ వరకు దాన్ని వదిలేశారు అనుకుందాం. మీ వయస్సు 25 సంవత్సరాలు 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేయాలనుకుంటే, మీ డబ్బు పెరగడానికి 35 సంవత్సరాలు సమయం ఉంటుంది. మీ ఇండెక్స్ ఫండ్ 15% రాబడిని ఇచ్చిందని అనుకుందాం, అయితే అది ఇంకా ఎక్కువ రాబడిని ఇవ్వగలదు.. తర్వాత 34 సంవత్సరాల తర్వాత మీ రూ. 1 కోటి కంటే ఎక్కువ అవుతుంది. అంటే పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు, మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.
మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత త్వరగా మీరు ధనవంతులు అవుతారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు కేవలం రూ.1 లక్ష మాత్రమే పెట్టుబడి పెట్టారు. మీ పదవీ విరమణ వరకు మీరు ఊహించనంత డబ్బు సంపాదించవచ్చు. దీనినే మిరాకిల్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. దీన్ని బట్టి ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే అంత త్వరగా ధనవంతులు కాగలరు.
గమనిక: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి లాభనష్టాలకు లోబడి ఉంటుంది. ఏషియా నెట్ న్యూస్ తెలుగు మీకు ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వడం లేదు. పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు.