అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. హెచ్‌1బీ వీసాల ఆంక్షలను ఎత్తేయాలని నిర్ణయం..

Ashok Kumar   | Asianet News
Published : Jan 11, 2021, 01:39 PM IST
అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. హెచ్‌1బీ వీసాల ఆంక్షలను ఎత్తేయాలని నిర్ణయం..

సారాంశం

జనవరి 20న  జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జో బిడెన్ పరిపాలన మొదట ఏమి చేయబోతుంది అనే ప్రశ్నకు స్పందిస్తూ "నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇమ్మిగ్రేషన్ బిల్లును ప్రవేశపెడతాను" అని డెలావేర్లోని విల్మింగ్టన్లో శుక్రవారం ఆయన విలేకరులతో అన్నారు. 

డొనాల్డ్  ట్రంప్ పరిపాలన విధానాలను తిప్పికొట్టేందుకు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ప్రవేశపెడతామని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ అన్నారు. అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు ఇది ఒక శుభవార్త.

అయితే జనవరి 20న  జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జో బిడెన్ పరిపాలన మొదట ఏమి చేయబోతుంది అనే ప్రశ్నకు స్పందిస్తూ "నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇమ్మిగ్రేషన్ బిల్లును ప్రవేశపెడతాను" అని డెలావేర్లోని విల్మింగ్టన్లో శుక్రవారం ఆయన విలేకరులతో అన్నారు.

ట్రంప్ పరిపాలనలో "క్రూరమైన" ఇమ్మిగ్రేషన్ విధానాలను తిప్పికొట్టడం జో బిడెన్ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. ముఖ్యంగా భారత ఐటీ నిపుణులకు అందించే హెచ్‌1బీ వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తామని, ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న నిషేదాన్ని రద్దు చేయడంతోపాటు, ఇందుకు వీలుగా నిబంధనల్లో సవరణలు చేపట్టనున్నారు.

అలాగే ప్రస్తుతం ఉన్న హెచ్‌1బీ వీసాల లాటరీ విధానానికి బైడెన్‌ స్వస్తి చెప్పే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఏడు ముస్లిం-మెజారిటీ దేశాలపై ప్రయాణ నిషేధాన్ని జారీ చేసినప్పటినుండి ఇమ్మిగ్రేషన్‌ను పరిమితం చేయడం ట్రంప్ పరిపాలన కేంద్రంగా ఉంది.

also read డొనాల్డ్‌ ట్రంప్‌న సోషల్ మీడియా అక్కౌంట్స్ పై బ్యాన్.. ఆ దాడులను ప్రోత్సాహించినందుకే అంటూ వెల్లడి.. ...

ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఆశ్రయం పొందటానికి అనుమతించిన వారిపై ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. ఇది యుఎస్ కార్మికులను రక్షించడానికి మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సూచించింది.

అతని పరిపాలన 2017లో డిఫెర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్  (డిఎసిఎ)ను అంతం చేయడానికి ప్రయత్నించింది, కాని సుప్రీంకోర్టు ఆ ప్రయత్నాన్ని జూన్ 2019లో అడ్డుకుంది. పర్యావరణ సమస్యలపై ట్రంప్ పరిపాలన ఆదేశాలను కూడా తాను వ్యతిరేకిస్తానని జో బిడెన్ చెప్పారు.

తన అధ్యక్ష పదవిలో మొదటి రోజున పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరాలని జో బిడెన్ ప్రతిజ్ఞ చేసారు. గత ఏడాది నవంబర్ 4న అమెరికా వాతావరణ మార్పులపై 2015 పారిస్ ఒప్పందం నుంచి అధికారికంగా వైదొలిగింది, ఈ నిర్ణయాన్ని మొదట అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2017లో ప్రకటించారు.

తన పదవికాలంలోని  మొదటి 100 రోజుల్లో 100 మిలియన్ షాట్లను ప్రజల చేతుల్లోకి తీసుకురావడానికి తాను కట్టుబడి ఉన్నానని బిడెన్ చెప్పారు.

"నేను పదవిలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు, పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసువస్తాను. ఇది పాఠశాలలను సాధ్యమైనంత వేగంగా, సురక్షితంగా తెరవడానికి సహాయపడుతుంది. ఇది మొదటి 100 రోజుల చివరిలో మొదలవుతుంది. అంతేకాకుండా మేము ఇప్పుడు చేయవలసిన చాలా అత్యవసర పనులు ఇది కూడా ఒకటి." అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు