భారతదేశపు అతిపెద్ద పారిశ్రామికవేత్త రతన్ టాటా... ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఎందుకు లేరు..?

By Krishna Adithya  |  First Published Jun 30, 2023, 3:42 PM IST

ప్రపంచ కుబేరుల జాబితా తీస్తే అందులో ఎప్పుడు భారతదేశం తరపునుంచి అంబానీ, అదానీ పేర్లే వినిపిస్తూ ఉంటాయి. కానీ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ గ్రూప్ కు సూత్రధారి అయినటువంటి రతన్ టాటా పేరు మాత్రం ఎక్కడా కనిపించదు. ఇంతకీ ఆయన ఆస్తుల విలువేంటో ఎందుకు ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో లేరో తెలుసుకుందాం.


ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు? సమాధానం ఎలాన్ మస్క్ అని అందరికీ తెలుసు. మస్క్ 228 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అయితే, మీరు ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా ?   మన దేశం తరఫునుంచి ఈ లిస్టులో అంబానీ, అదాని పేర్లు ఉంటాయి కానీ మన దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా పేరు కనిపించదు.  కనీసం మన దేశం తరఫున ఉన్నటువంటి సంపన్నుల జాబితాను విడుదల చేసే IIFL వెల్త్, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో కూడా రతన్ టాటా పేరు కనిపించదు. 

భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా కంటే  ధనవంతులు  IIFL వెల్త్, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 432 మంది ఉన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా భారతదేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం టాటా సన్స్ కు నాయకత్వం వహించిన రతన్ టాటా కనీసం భారతదేశంలోని టాప్ 10 లేదా 20 మంది వ్యాపారవేత్తలలో ఒకరిగా కూడా లేరు. నిజానికి 2021లో 103 బిలియన్ యుఎస్ డాలర్ల ఆదాయంతో, టాటా గ్రూప్ భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పోరేట్ సంస్థలలో ఒకటిగా నిలిచింది. 

Latest Videos

దేశంలో ఉన్నటువంటి సంపన్నుల లిస్టులో రతన్ టాటా 433వ స్థానంలో నిలిచారు ఆయన ఆస్తి విలువ 3,500 కోట్లు కావడం విశేషం. కార్పొరేట్ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న రతన్ టాటా సంపద కన్నా కూడా  అధిక సంపదను దేశంలోని చాలా పారిశ్రామికవేత్తలు కలిగి ఉండటం ఆశ్చర్యకరం. అయితే టాటా ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి  రతన్ టాటా తన సంపదలో అధిక భాగం దాతృత్వ పనులకే కేటాయిస్తారని పేరు ఉంది అందువల్లే ఆయన వ్యక్తిగత సంపద అంతగా పెరగలేదని నిపుణులు చెబుతున్నారు.

విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే ఆశ్చర్యం కలగడం ఖాయం మొత్తం 29 లిస్ట్ కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ 22 లక్షల కోట్లు అంటే ఆశ్చర్యపోవడం ఖాయం.  ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలుగా పేరొందిన రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూపు వంటివి టాటా గ్రూపు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.

గత దశాబ్దంన్నర కాలంగా, టాటా గ్రూప్ భారతదేశం అత్యంత ముఖ్యమైన అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తోంది. రతన్ టాటా, ఆయన కుటుంబం టాటా గ్రూప్ ప్రారంభం నుండి సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. రతన్ టాటా ఆరోగ్య రంగానికి అవసరమైన సౌకర్యాలను అందించడం ద్వారా, విద్యా వ్యవస్థ అభివృద్ధికి సహాయం చేయడం ద్వారా భారతదేశ అభివృద్ధికి చాలా దోహదపడ్డారు. 

టాటా గ్రూప్‌కు మెటల్స్, మైనింగ్‌లో గణనీయమైన ఆసక్తి ఉంది. టాటా కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిటైల్, ఆటో, కెమికల్స్, ట్రాన్స్‌పోర్టేషన్‌తో సహా అనేక రంగాలలో నిమగ్నమై ఉంది. టాటా గ్రూప్‌లో కనీసం 29 లిస్టెడ్ కంపెనీలు, మరెన్నో అన్‌లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. 

 

click me!