పార్లమెంట్‌లో బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు చేస్తారో తెలుసా.. ?

By Ashok kumar Sandra  |  First Published Jan 22, 2024, 3:31 PM IST

పార్లమెంటులో ప్రతి ఏడాది బడ్జెట్ ముందు 'హల్వా వేడుక' జరుగుతుంది. దీని ఔచిత్యమేమిటో తెలుసా? పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి హల్వా ఎందుకు అందిస్తారంటే.. 
 


ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంటులో 'హల్వా వేడుక' జరుగుతుంది. దీని ఔచిత్యమేమిటో తెలుసా? పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి హల్వా ఎందుకు వడ్డిస్తారు ? ఈ హల్వా వేడుక బడ్జెట్ కార్యకలాపాలకు అధికారిక ప్రారంభంగా పరిగణించబడుతుంది. 'హల్వా వేడుక' అనేది పార్లమెంట్‌లో అనాదిగా వస్తున్న ఆచారం. బడ్జెట్ కార్యక్రమాలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ అధికారులకు హల్వా  అందిస్తారు . 

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కొద్దిరోజుల ముందు అధికారులకు స్వీట్స్  పంచే కార్యక్రమం జరుగుతోంది. ఆర్థిక మంత్రి సాధారణంగా తన సహచరులకు హల్వా ఇస్తారు . బడ్జెట్ తయారీలో పాల్గొనే సీనియర్ అధికారుల సమక్షంలో ఈ  వేడుక జరుగుతుంది. పార్లమెంటులోని నార్త్ బ్లాక్‌లో హల్వా వేడుకను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న సిబ్బంది అందరికీ హల్వా  అందించబడుతుంది. 

Latest Videos

హల్వా వేడుక అనంతరం బడ్జెట్‌ తయారీలో నిమగ్నమైన అధికారులను పార్లమెంట్‌లోనే ఉంచుతారు. బడ్జెట్ ప్రెజెంటేషన్ పూర్తయ్యే వరకు వారు బయటకు వెళ్లడానికి లేదా ఇంకా వారి ఇళ్లకు వెళ్లడానికి అనుమతించరు అలాగే  వారు Gmail లేదా సోషల్ మీడియాను ఉపయోగించడానికి అనుమతించరు, చివరికి ఫోన్ కూడా ఉపయోగించబడదు. బడ్జెట్‌లో గోప్యత పాటించేందుకు అధికారులు ఇలా వారిని  ‘లాక్‌’ చేస్తారు. అయితే ఉన్నతాధికారులు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. 

కానీ ఈ వేడుకను 2022లో నిర్వహించలేదు. కరోనా మహమ్మారి కారణంగా హాల్వా వేడుక నిర్వహించనప్పటికీ హల్వా వేడుకలకు బదులు అధికారులు, ఉద్యోగులకు స్వీట్లు పంచిపెట్టారు.

click me!