Petrol-Diesel Price: క్రూడాయిల్ ధరలు పెరిగినా పెట్రోల్, డీజెల్ ధరలు తగ్గించాలి, Morgan Stanley కీలక సూచన

Published : Mar 01, 2022, 11:45 AM IST
Petrol-Diesel Price: క్రూడాయిల్ ధరలు పెరిగినా పెట్రోల్, డీజెల్ ధరలు తగ్గించాలి, Morgan Stanley కీలక సూచన

సారాంశం

పెరుగుతున్న క్రూడాయిల్ ధరల నేపథ్యంలో భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఇంధన ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 5-10 తగ్గించాలని, తద్వారా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించవచ్చని ఉపాసనా చాచ్రా పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు. దీంతో పన్ను వసూళ్లు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఉక్రెయిన్, రష్యా సంక్షోభంతో ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారల్ కు 100 డాలర్ల మార్కును దాటేశాయి. దీంతో దేశీయంగా కూడా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol-Diesel Price)పెరుగుతాయనే ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు తగ్గట్టే అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఎన్నికల అనంతరం ఇంధన ధరలను పెంచే వీలుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  Morgan Stanley సంస్థకు చెందిన ఉపాసనా చాచ్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. క్రూడాయిల్ ధరలు పెరిగితే, భారత ప్రభుత్వం కూడా ఇంధన ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 5-10 తగ్గించాలని ఇటీవల ఆమె తయారు చేసిన నోట్ ద్వారా పేర్కొన్నారు.

క్రూడాయిల్ ధరలు పెరిగితే, భారత ప్రభుత్వం ఇంధన ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 5-10 తగ్గించాలని, తద్వారా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించవచ్చని ఉపాసనా చాచ్రా పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు. దీంతో పన్ను వసూళ్లు కూడా తగ్గే అవకాశం ఉందని, చమురు ధరల పెరుగుదల వల్ల ఏర్పడే ఆర్థిక సమస్యలను తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఉపశమన చర్యలు సరిపోవని ఆమె అన్నారు. ఉపశమన చర్యల బదులుగా చమురు ధరలను తగ్గించడం సరైన చర్య అవుతుందని ఆమె పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే ద్రవ్యోల్బణం రేటు ఇప్పటికే 6 శాతానికి మించి ఉందని ఆమె అన్నారు. చమురు ధరలు ఇంకా పెరగడం, అలాగే రిటైల్ ఇంధన ధరలు పెరిగితే  ద్రవ్యోల్బణం రేటు 6 శాతానికి పెరుగుతుందని. అదే సమయంలో, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటుపై ఇది ఒత్తిడిని మరింత పెంచుతుందని, చివరికి ద్రవ్యోల్బణంలో మరింత పెరుగుదలకు దారి తీస్తుందని ఉపాసనా చాచ్రా అంచనా వేశారు.

పెరుగుతున్న చమురు ధరల ప్రభావం నుండి వ్యాపారులు, సాధారణ వినియోగదారులను రక్షించడానికి సమీప కాలంలో ప్రభుత్వం అదనపు సబ్సిడీ లేదా ఇంధన పన్ను తగ్గింపు కోసం ఏర్పాటు చేస్తే మంచిదని మోర్గాన్ స్టాన్లీ ద్వారా ఆమె తెలిపారు. అయితే అధిక ఇంధన ధరల నేపథ్యంలో, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన పరివర్తన దిశగా పెట్టుబడులను పెంచడంపై దృష్టి పెట్టాలని తెలిపారు. 

తైవాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంక్‌లు త్వరలో తమ రేట్లను పెంచవచ్చని మోర్గాన్ స్టాన్లీ  ఈ నోట్ ద్వారా పేర్కొంది. భారత్‌కు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ ప్రతినిధి ఉపాసనా చాచ్రా మాట్లాడుతూ.. త్వరలో భారత్‌లోనూ ఇలాంటివి చూడొచ్చని, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఆర్‌బిఐ త్వరలో రేట్ల పెంపు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్‌లో జరగనున్న పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు