పాకిస్థాన్‌లో ఏం జరిగింది..? కిలో టమాటా రూ.500, ఉల్లి ధర రూ.400..

Published : Aug 30, 2022, 05:33 PM IST
పాకిస్థాన్‌లో ఏం జరిగింది..? కిలో టమాటా రూ.500,  ఉల్లి ధర రూ.400..

సారాంశం

లాహోర్‌లోని కూరగాయల మార్కెట్ డీలర్లు మాట్లాడుతూ దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న టమోటాలు, ఉల్లిపాయల ధరల కారణంగా వాటిని ఇప్పుడు  దిగుమతి చేసుకోనే ఆలోచనలో ఉంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కూరగాయలు, పంటలకు భారీ నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. 

భారతదేశ  పొరుగు దేశం పాకిస్థాన్ గత కొన్ని నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజకీయ సంక్షోభం కారణంగా దేశం ఆర్థిక రంగం కూడా పోరాడుతోంది. ఇప్పుడు పాకిస్థాన్ దేశం కూడా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలు తీవ్ర వరదలను ఎదుర్కొంటున్నాయి. 

ద్రవ్యోల్బణం కారణంగా కష్టతరంగా సామాన్యుల జీవనం 
ఈ ప్రతికూల పరిస్థితుల మధ్య ద్రవ్యోల్బణం పాకిస్తాన్‌లోని సామాన్యుల జీవితాన్ని కూడా కష్టతరం చేసింది. తిండి, పానీయాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. ప్రజలు కూరగాయలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. మీడియా నివేదికల ప్రకారం ప్రస్తుత  రోజుల్లో టొమాటో కిలో రూ. 500కి, ఉల్లిపాయలు కిలో రూ. 400 చొప్పున పాకిస్థాన్‌లోని మండిలో విక్రయిస్తున్నారు. 

కూరగాయల దిగుమతి ఆలోచనలో 
లాహోర్‌లోని కూరగాయల మార్కెట్ డీలర్లు మాట్లాడుతూ దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న టమోటాలు, ఉల్లిపాయల ధరల కారణంగా వాటిని ఇప్పుడు  దిగుమతి చేసుకోనే ఆలోచనలో ఉంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కూరగాయలు, పంటలకు భారీ నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. లాహోర్‌తో సహా పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

వరదల కారణంగా కూరగాయలు సరఫరా కావడం లేదని 
మీడియా కథనాల ప్రకారం, టమోటాలు కిలో 500 రూపాయలకు విక్రయించగా, ఆదివారం పాకిస్తాన్‌లో ఉల్లిపాయలు కిలో 400 రూపాయలకు విక్రయించారు. వరదల కారణంగా బలూచిస్థాన్, సింధ్, దక్షిణ పంజాబ్ ప్రాంతాల నుంచి కూరగాయలు సరఫరా కావడం లేదని,  కూరగాయల కొరత దృష్ట్యా రానున్న రోజుల్లో టమాటా, ఉల్లి ధరలు కిలో రూ.700కు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళదుంపలు కూడా కిలో రూ.40 నుంచి రూ.120 వరకు విక్రయించవచ్చు.

వేల ఎకరాల్లో వేసిన పంటలు నాశనమయ్యాయి 
మీడియా నివేదికల ప్రకారం, బలూచిస్తాన్, సింధ్ ప్రాంతంలో వరదల కారణంగా వేలాది ఎకరాల్లో టమోటా, ఉల్లి  ఇతర కూరగాయల పంటలు నాశనమయ్యాయి. దీంతో పరిస్థితి మరింత దిగజారింది, ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం వాఘా సరిహద్దు ద్వారా భారతదేశం నుండి టమోటాలు,  ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం, టొమాటోలు, ఉల్లిపాయలు ఆఫ్ఘనిస్తాన్ నుండి టోర్ఖమ్ సరిహద్దు ద్వారా లాహోర్‌తో సహా ఇతర నగరాలకు సరఫరా చేయబడుతున్నాయి. 

పాకిస్తాన్‌లోని మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బలూచిస్తాన్ టఫ్తాన్ సరిహద్దు ద్వారా ఇరాన్ నుండి టమోటాలు, ఉల్లిపాయలను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది, అయితే ఇరాన్ ప్రభుత్వం దిగుమతి-ఎగుమతిపై పన్నును గణనీయంగా పెంచింది. ఖరీదైన రేటుకు దిగుమతి చేసుకుంటే, స్థానిక వినియోగదారులకు ప్రయోజనం ఉండదు. భవిష్యత్తులో ఖర్జూరం, అరటిపండ్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే బలూచిస్తాన్ ఇతర ప్రాంతాల నుండి ఆపిల్ సరఫరా కూడా లేదు. 

ధాన్యంపై సంక్షోభం 
పాకిస్థాన్‌లో వరదల కారణంగా పత్తి పంటలు నష్టపోవడంతో 2.6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. చక్కెర, దుస్తుల ఎగుమతులు కూడా ఒక బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. సింధ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ గోడౌన్లలో ఉంచిన సుమారు రెండు మిలియన్ టన్నుల గోధుమలు వర్షం, వరదల కారణంగా వృధాగా పోయాయి. తాజా పరిస్థితులను చూస్తుంటే రానున్న కాలంలో  పాకిస్థాన్ పొరుగు దేశాలు కూడా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !