Hyundai Exter: 6 లక్షల రూపాయల లోపు SUV కారు కొనాలని ఉందా...అయితే Hyundai Exterపై ఓ లుక్కేయండి..

By Krishna Adithya  |  First Published Jul 11, 2023, 12:15 AM IST

హ్యుందాయ్ తన కొత్త మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా పంచ్ కు ప్రత్యర్థిగా ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ.5.99 లక్షలుగా నిర్ణయించగా, బడ్జెట్ ధరలో ఈ కారును విడుదల చేసిన తర్వాత, భారీ డిమాండ్ ఏర్పడింది.


భారతదేశంలో కార్ల మార్కెట్‌లో కదలిక వచ్చింది. టాటా పంచ్ విడుదలైన తర్వాత మైక్రో ఎస్‌యూవీ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు హ్యుందాయ్ ఎక్స్ టర్ టాటా పంచ్‌కు ప్రత్యర్థిగా విడుదల చేయనున్నారు. ఇది మినీ SUV కారు. ఈ కొత్త కారు ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది. ఇందులో టాప్ మోడల్ ధర రూ.9.31 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.  మైక్రో SUVలలో, హ్యుందాయ్ Xter అత్యంత తక్కువ ధర ఉన్న కారు. కారణం టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్), Citroen C3ధర రూ. 6.16 లక్షలు (ఎక్స్-షోరూమ్). కానీ హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండటం విశేషం. 

హ్యుందాయ్ Xter వేరియంట్, ధర
>> హ్యుందాయ్ Xter EX (మాన్యువల్) : రూ. 5,99,900 (ఎక్స్-షోరూమ్)
>> హ్యుందాయ్ Xtr S (మాన్యువల్) : రూ. 7,26,990 (ఎక్స్-షోరూమ్)
>> హ్యుందాయ్ Xter SX (మాన్యువల్) : రూ. 7,99,990 (ఎక్స్-షోరూమ్)
>>  హ్యుందాయ్ XterSX (O)(మాన్యువల్) : రూ. 8,63,990 (ఎక్స్-షోరూమ్)
>> హ్యుందాయ్ XterSX(O) కనెక్ట్(మాన్యువల్): రూ. 9,31,990 (ఎక్స్-షోరూమ్)
>> హ్యుందాయ్ Xtr ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 7,96,980,
>> CNG వేరియంట్ ధర రూ. 8,23,990 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. 

Latest Videos

undefined

హ్యుందాయ్ Xter స్ప్టిట్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా, హెచ్-ఆకారంలో పగటిపూట రన్నింగ్ లైట్లు, LED ప్రొజెక్టర్‌తో సహా అనేక వినూత్న డిజైన్‌లు ఇక్కడ ఉన్నాయి. కొత్త Xter అద్భుతమైన డిజైన్‌తో మైక్రో కంటే పెద్దదిగా కనిపిస్తుంది. చిన్న కారు అయినప్పటికీ, ఇది మంచి స్పేస్ కలిగి ఉంటుంది.

కొత్త కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, CNG వేరియంట్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త కారు 81.86బిహెచ్‌పి పవర్, 113.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కాబట్టి పనితీరు, పికప్ కూడా బాగుంది. కారు CNG వేరియంట్ 68 BHP శక్తిని  95.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ పెట్రోల్ మాన్యువల్ ఇంజన్ కారు లీటర్ పెట్రోల్‌కు 19.4 కిమీ మైలేజీని ఇస్తుండగా. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు లీటరుకు 19.2 కిమీ మైలేజీని ఇవ్వగా, సిఎన్‌జి వేరియంట్ 27.1 కిమీ మైలేజీని ఇస్తుంది. హ్యుందాయ్ Xter టాటా పంచ్‌కు ప్రత్యక్ష పోటీదారుగా మార్కెట్లో ఉంది. ఇది కాకుండా, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, మారుతి సుజుకి ఫ్రాంక్‌ కూడా పోటీ ఇస్తున్నాయి. 

click me!