మీ ట్విట్టర్ అకౌంటుకు గోల్డ్ టిక్ కావాాలా..అయితే నెలకు ఎంత చెల్లించాలో తెలుసుకోండి..?

Published : Mar 27, 2023, 01:46 AM IST
మీ ట్విట్టర్ అకౌంటుకు గోల్డ్ టిక్ కావాాలా..అయితే నెలకు ఎంత చెల్లించాలో తెలుసుకోండి..?

సారాంశం

మీ ట్విట్టర్ ఖాతాకు బ్లూటిక్ మాత్రమే కాదు..ఏకంగా గోల్డెన్ టిక్ కావాలా...అయితే ట్విట్టర్ కు నెలకు సుమారు 1000 డాలర్లు చెల్లించి ఈ టిక్ పొందే వీలుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

ట్విట్టర్ తన లెగసీ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను దశలవారీగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా గతంలో ఫ్రీగా బ్లూటిక్స్ ఇచ్చిన యూజర్ల ఖాతాల వెరిఫికేషన్ తొలగించనుంది. అంతేకాదు డబ్బు చెల్లించిన యూజర్ల ఖాతాలకు బ్లూ టిక్‌లను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, ఎలోన్ మస్క్ ఈ బ్లూటిక్ మీద డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. అంతేకాదు బ్లూటిక్ తో పాటు మస్క్ అతను వివిధ రంగుల టిక్ మార్క్‌లను కూడా ప్రకటించాడు. దీనికి గోల్డెన్ టిక్  మార్క్ కూడా ఉంది. వ్యాపార సంస్థలకు గోల్డెన్ టిక్ ‌మార్క్‌లు ఇవ్వనున్నారు.  దీని కోసం ట్విట్టర్ నెలకు  సుమారు 1000 డాలర్లు వసూలు చేయనుంది. 

ట్విట్టర్ కొత్త వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభిస్తోందని కొద్ది రోజుల క్రితం మాట్ నవారా ట్వీట్ చేశారు. దీని కోసం, కంపెనీలు గోల్డ్ టిక్ ‌మార్క్ లేదా గోల్డ్ టిక్ కోసం నెలకు 1000 డాలర్లు అంటే సుమారుగా 82000 రూపాయలు చెల్లించాలని తెలిపారు. అయితే దీనిపై ట్విట్టర్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. దీనికి సంబంధించిన వార్త  బిజినెస్ ఇన్‌సైడర్ లో పేర్కొన్నారు. గోల్డ్ టిక్ పొందడానికి కంపెనీలు ఆసక్తి చూపే అవకాశం ఉందని మస్క్ భావిస్తున్నారు.  ఇది మాత్రమే కాదు, గోల్డ్ టిక్ ఖాతాతో లింక్ చేయబడిన అన్ని ఇతర ఖాతాలకు కూడా కంపెనీలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 

ట్విట్టర్ వినియోగదారులందరూ బ్లూ బ్యాడ్జ్ కోసం చెల్లించాలని ఎలాన్ మస్క్ కోరుకుంటున్నారు. 3 నెలల క్రితం ప్రారంభమైన ఈ సర్వీస్ ద్వారా ట్విట్టర్ ఎంత సంపాదించిందో ఇప్పుడు ఒక నివేదిక వచ్చింది. నివేదిక ప్రకారం, బ్లూ బ్యాడ్జ్ చెల్లింపు సేవ నుండి ట్విట్టర్ ఇప్పటివరకు  11 మిలియన్ డాలర్లను సంపాదించింది అంటే సుమారు రూ.90 కోట్లుగా చెప్పవచ్చు. ఏప్రిల్ 1 నుండి, చెల్లించని ఖాతాల నుండి ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్‌ను తొలగిస్తుందని ఇప్పటికే ప్రకటించింది. 

 

 

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!