వొడాఫోన్-ఐడియా విలీనం: కొలువులు హాంఫట్

First Published 9, Sep 2018, 1:05 PM IST
Highlights

 ఐడియా-వొడాఫోన్‌ కంపెనీల విలీనం పూర్తి కావడంతో  దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. రిలయన్స్ జియో ప్రభావంతో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సతమతమవుతున్న టెల్కో సంస్థలు సంఘటితం అవుతున్నాయి. 

న్యూఢిల్లీ: ఐడియా-వొడాఫోన్‌ కంపెనీల విలీనం పూర్తి కావడంతో  దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. రిలయన్స్ జియో ప్రభావంతో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సతమతమవుతున్న టెల్కో సంస్థలు సంఘటితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విలీనమైన ఐడియా-వొడాఫోన్‌ ఉమ్మడి యాజమాన్యం ప్రారంభంలోనే పొదుపు దిశగా చర్యలు చేపడుతోంది. తద్వారా రూ.72,105 కోట్లు పొదుపు చేసుకోవాలని కలలు కంటోంది. 

అందుకోసం తమ తమ ఉద్యోగుల సంఖ్యను 15 వేలకు కుదించాలని రెండు సంస్థలు విడివిడిగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల్లో 17,500 నుంచి 18 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే వీరిలో 2500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసేయాలని ఐడియా-వొడాఫోన్‌లు నిర్ణయించాయి. ఇందుకోసం రెండు నెలల సమయాన్ని నిర్దేశిత గడువుగా పెట్టుకున్నాయి. అయితే వొడాఫోన్ - ఆదిత్యబిర్లా గ్రూప్ సంస్థలు కొందరిని తమ సొంత సంస్థల్లో ఇతర భాగాల్లో 

 కొంతమంది ఉద్యోగులను పేరెంట్‌ కంపెనీలు వొడాఫోన్‌ గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి తీసుకుని, మిగతా కొంతమందిపై వేటు వేయాలని ఈ విలీన సంస్థ ప్రణాళిక రూపొందించింది. అంతేకాక ఉద్యోగులకు ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను కూడా ప్ర​స్తుతం పక్కన పెట్టింది. ఉద్యోగుల వేటు వేస్తారని చక్కర్లు కొడుతున్న వార్తలు ఊహాగానాలేనని వొడాఫోన్‌-ఇండియా కొట్టిపారేసింది. 

‘కొంతవరకు హేతుబద్దీకరణ ఉంటుంది. అది సర్వసాధారణం. కంపెనీ వచ్చే కొన్ని నెలల్లో ఉద్యోగుల సంఖ్యను 2000 నుంచి 2500 మందిని తగ్గించుకోవాలనుకుంటుంది’ అని ఈ విషయం తెలిసిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని కంపెనీ పట్టించుకుంటుందని, సెవరెన్స్‌ ప్యాకేజీలను అందిస్తుందని, పేరెంట్‌ గ్రూప్‌ ఆదిత్యా బిర్లా గ్రూప్‌లో ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే టెలికాం కంపెనీల్లో ఉద్యోగుల కోత ఇదేమీ కొత్త కాదు. రిలయన్స్‌ జియో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, టెలికాం రంగం అస్తవ్యస్తమైంది.

ఇక అప్పటి నుంచి టెలికాం కంపెనీలు పోటీని తట్టుకోలేక, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేటు వేయడం ప్రారంభించాయి. వొడాఫోన్‌ ఇండియా కూడా వాలంటరీ అట్రిక్షన్‌ను ఆఫర్‌చేస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగుల సంఖ్య తగ్గించేస్తుంది. వొడాఫోన్‌ ఇండియా ఉద్యోగులను, ఐడియా సెల్యులార్‌ ఉద్యోగులను విలీన సంస్థ సమానంగా చూస్తోంది. ఉద్యోగులందరిన్నీ ఎంతో గౌరవంగా చూస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా హెచ్‌ఆర్‌ హెడ్‌ చెప్పారు. కానీ ఉద్యోగుల తొలగింపు విషయమై వచ్చే పుకార్లపై స్పందించబోమని వొడాఫోన్-ఐడియా వ్యాఖ్యానించింది. 
 

Last Updated 9, Sep 2018, 1:05 PM IST