Vivo: వివో నుంచి రెండు మడతపెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయ్: ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయ్

Published : Jun 02, 2025, 07:05 PM IST
Vivo: వివో నుంచి రెండు మడతపెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయ్: ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయ్

సారాంశం

Vivo: వివో నుంచి రెండు మడత పెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయ్. అవి వివో X200 FE, వివో X ఫోల్డ్5. ఈ మొబైల్స్ లాంచ్ డేట్, ఫీచర్స్, స్పెక్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం రండి. 

మీకు ఫోల్డబుల్ ఫోన్లు ఇష్టమా? అయితే వివో త్వరలో ఇండియాలో లాంచ్ చేయనున్న రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ పై ఓ లుక్కేయండి. వివో కంపెనీ X200 FE, X ఫోల్డ్5 అనే రెండు మడతపెట్టే ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. వివో X200 FE ఇండియన్ BIS సర్టిఫికేషన్ కూడా పొందింది. రెండు ఫోన్స్‌లోనూ ఫ్లాగ్‌షిప్ లెవెల్ స్పెక్స్ ఉంటాయని సమాచారం.

వివో X200 FE, X ఫోల్డ్5 ఫోన్లు లాంచ్ డేట్ ఎప్పుడంటే?

వివో X200 FE, వివో X ఫోల్డ్ 5 లాంచ్ డేట్ కూడా లీక్ అయ్యింది. జూలై 10న రెండు ఫోన్స్ లాంచ్ అవుతాయని సమాచారం. వివో X200 FEకి 6.31 ఇంచ్ 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ లేదా 9400e చిప్‌సెట్ ఉండొచ్చు. దీనివల్ల గేమింగ్, మల్టీ టాస్కింగ్ బాగుంటుంది.

వివో X200 FE కెమెరా ఫీచర్లు

కెమెరా విషయానికి వస్తే 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్ 3X ఆప్టికల్ జూమ్‌తో, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP68, IP69 రేటింగ్స్ కూడా ఉంటాయి.

వివో X ఫోల్డ్5 ఫోల్డబుల్ ఫోన్

వివో X ఫోల్డ్5 ఒక ఫోల్డబుల్ ఫోన్. అంటే దీన్ని ఈజీగా మడతపెట్టేయొచ్చు. 8.03 ఇంచ్ 2K ఇంటర్నల్ డిస్‌ప్లే, 6.53 ఇంచ్ LTPO OLED బాహ్య డిస్‌ప్లే ఉంటాయి. రెండింటికీ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్, 16GB RAM, 512GB స్టోరేజ్ ఉంటాయి.

వివో X ఫోల్డ్5 కెమెరా ఫీచర్లు

X ఫోల్డ్5 కెమెరాలు 50MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 50MP 3X టెలిఫోటో లెన్స్. సెల్ఫీలకు 32MP కెమెరా ఉంటుంది. 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?