Vishnu Prakash IPO : విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ IPO నేటి నుంచి తెరుచుకుంది. 28 ఆగస్టు 2023 వరకు ముగియనుంది. ఈ కంపెనీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అలాగే ప్రైవేట్ సంస్థల కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను డిజైన్ చేస్తుంది. IPO ద్వారా రూ. 308.88 కోట్ల విలువైన 31,200,000 ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ చేస్తున్నారు.
Vishnu Prakash IPO ఐపీఓ ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే మరో ఐపిఓ మార్కెట్ లో ఓపెన్ అయింది. మీరు ప్రైమరీ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదించాలి, అనుకుంటే ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. నేటి నుంచి Vishnu Prakash R Punglia సంస్థ IPO ఓపెన్ కానుంది. ఈ మధ్యకాలంలో ఐపివోలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఐపిఓలపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉన్నారు.
విష్ణు ప్రకాష్ IPO ద్వారా రూ. 308.88 కోట్లు సమీకరించనుంది. కంపెనీ ఆరోగ్యకరమైన ఆర్డర్ బుక్‌ను కలిగి ఉన్నందున, పరిశ్రమ హెడ్‌విండ్‌లు రాబోయే సంవత్సరాల్లో దాని లాభదాయకతకు సహాయపడతాయని భావిస్తున్నారు. దీంతో ఇష్యూకు సబ్ స్క్రైబ్ అందించాలని విశ్లేషకులు పెట్టుబడిదారులకు సూచించారు.
విష్ణు ప్రకాష్ కంపెనీ ఏం చేస్తుంది?
విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా ఐపీవో అనేది ప్రాథమికంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో నిమగ్నమైన నిర్మాణ సంస్థ. సంస్థ నీటి సరఫరా ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందుతోంది.
జూలై 15, 2023 నాటికి కంపెనీ 51 కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది, మొత్తం పనికి రూ. 6,183 కోట్లు అందుకుంది. వీటిలో రూ. 2,384 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అలాగే రూ.3,799 కోట్ల బ్యాలెన్స్ వర్క్ ఆర్డర్ లు లైన్ లో ఉన్నాయి.
సంస్థ ఆర్థిక స్థితి
మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 44.85 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అదే ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ రూ. 18.98 కోట్ల నికర లాభం ఆర్జించింది. అదేవిధంగా సమీక్షా కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.485.73 కోట్ల నుంచి రూ.785.61 కోట్లకు పెరిగింది.
Vishnu Prakash R Punglia IPO వివరాలు ఇవే..
Issue Date: 24 ఆగస్టు - 28 ఆగస్టు
Price Range : రూ. 94 to రూ. 99
IPO Size: రూ. 308.88 కోట్లు
మినిమం పెట్టుబడి: రూ. 14,100