
Venus Pipes and Tubes Ltd Listing: LIC IPO అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, నేడు లిస్ట్ అయినటువంటి, వీనస్ పైప్స్ & ట్యూబ్స్ మాత్రం ఇన్వెస్టర్లు లాభాలను అందించింది. స్టెయిన్‌లెస్ స్టీల్ తయారీదారు ఎగుమతిదారు అయిన ఈ కంపెనీ మే 24న BSEలో రూ. 9, NSEలో రూ. 11.50 ప్రీమియంతో లిస్ట్ అయ్యింది. ఒక్కో షేరుకు రూ.326 చొప్పున ఐపీఓ పెట్టుబడిదారులకు కంపెనీ షేర్లు అలాట్ అయ్యాయి. అయితే నేడు లిస్టింగ్ మాత్రం దాదాపు 3.50 శాతం ప్రీమియంతో జరిగింది. దీన్ని కంపెనీ లిస్టింగ్ పూర్తిగా మార్కెట్ సెంటిమెంట్‌పైనే ఆధారపడి ఉంటుందని ఈ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి మే 23 వరకు, గ్రే మార్కెట్‌లో Venus Pipes and Tubes కంపెనీ షేర్లు రూ.30 ప్రీమియంను అంచనా వేశాయి.
లిస్టింగ్ సమయంలో అప్పర్ సర్క్యూట్ తాకాయి...
Venus Pipes and Tubes Ltd Listing ప్రారంభ ట్రేడ్‌లో, NSE, BSE రెండింటిలోనూ దాని షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకాయి. ఉదయం 10:30 గంటల సమయానికి, Venus Pipes and Tubes షేర్లు ఎన్‌ఎస్‌ఇలో 8.7 శాతం లాభపడి రూ. 354.35 వద్ద ట్రేడవగా, బిఎస్‌ఇలో దాదాపు 8 శాతం లాభపడి రూ. 351.75కి చేరుకున్నాయి.
IPOకు అద్భుతమైన రెస్పాన్స్...
మే 11న ప్రారంభమైన వీనస్ పైప్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. కంపెనీ షేర్లు మొత్తం 16.31 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వు చేయబడిన షేర్ 19.04 రెట్లు, NIIల కోసం 15.66 రెట్లు మరియు QIBల కోసం రిజర్వు చేయబడిన షేర్ 12.02 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఇష్యూ భారీగా సబ్‌స్క్రయిబ్ కావడానికి కారణం, ఇష్యూ పరిమాణం చిన్నగా ఉండటమే అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. వీనస్ పైప్స్ & ట్యూబ్స్ IPO మొత్తం పరిమాణం రూ. 165.42 కోట్లు మాత్రమే. కంపెనీ IPO ద్వారా సేకరించిన డబ్బును ఫెసిలిటీస్ విస్తరణ, టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ కోసం, అలాగే వర్కింగ్ క్యాపిటల్ సహా ఇతర పనుల కోసం ఉపయోగించనున్నట్లు తెలిపింది.
కంపెనీ వ్యాపారం
వీనస్ పైప్స్ & ట్యూబ్స్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబులర్ ఉత్పత్తులను తయారు చేయడంలో దాదాపు 6 సంవత్సరాల అనుభవం కలిగి ఉంది. వీనస్ బ్రాండ్ క్రింద, కంపెనీ తన ఉత్పత్తులను వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టెయిన్‌లెస్ స్టీల్ పైప్స్ & ట్యూబ్‌ల తయారీదారులలో కంపెనీ ఒకటి. కంపెనీ గుజరాత్‌లో 10,800 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో తయారీ యూనిట్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంతో పాటు విదేశాలలో తన ఉత్పత్తులను విక్రయిస్తుంది. 28 ఫిబ్రవరి 2022 నాటికి, కంపెనీ తన ఉత్పత్తులను UK, బ్రెజిల్ మరియు ఇజ్రాయెల్‌తో సహా 20 దేశాలకు ఎగుమతి చేస్తోంది.