
Petrol Diesel Prices: పెరుగుతున్న ధరల నుంచి వాహనదారులకు ఉపశమనం ఇస్తూ.. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. కేంద్రం తర్వాత పలు రాష్ట్రాలు కూడా చమురు ధరలను తగ్గించడం ప్రారంభించాయి.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించగా, రాష్ట్రాలు కూడా తమ తరపున వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్ తగ్గించడంతో దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.109.27కే లభిస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) మే 24న సైతం మార్పు చెందకుండా స్థిరంగా ఉన్నాయి. మే 24న హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.64 పలుకుతుండగా, డీజిల్ ధర రూ.97.8 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు నగరాల్లో పెట్రోల్ రేటు లీటరుకు రూ.111.74 వద్ద, డీజిల్ రేటు రూ.99.49 వద్ద ఉన్నాయి.
నాలుగు మహానగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు
>> ఢిల్లీ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
>> ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.109.27, డీజిల్ రూ.95.84
>> చెన్నై పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24
>> కోల్‌కతా పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76
కొత్త రేట్లు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు విడుదల చేస్తారు.
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర పన్నులను జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడానికి ఇదే కారణం.
నేటి తాజా ధరను మీరు ఇలా తెలుసుకోవచ్చు
మీరు SMS ద్వారా పెట్రోల్ డీజిల్ రోజువారీ రేటును కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSPని 9224992249 నంబర్‌కు మరియు BPCL వినియోగదారులు RSPని 9223112222 నంబర్‌కు పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HPPriceని 9222201122 నంబర్‌కు పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.