వేదాంత ఛైర్మన్, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, అనిల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తరచుగా స్ఫూర్తిదాయకమైన విషయాలను ఆయన పంచుకుంటారు. తన జీవన పోరాటానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెబుతుంటారు. రీసెంట్‌గా ఆయన తన లైఫ్ సక్సెస్ సీక్రెట్ చెప్పాడు.
మనలో చాలామంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటారు. కానీ, మూలధనం లేదా ధైర్యం లేని కారణంగా నష్టపోతే, భవిష్యత్తు జీవితం అంధకారం అవుతుందని బాధపడుతుంటారు. లేదా ఇతర కారణాల వల్ల వారు తమ స్వంత వ్యాపారం లేదా కంపెనీని ప్రారంభించకుండా దూరంగా ఉంటారు. అలాగే చాలామంది సొంతంగా వ్యాపారాలు ప్రారంభించలేరు. కానీ, అలాంటి వ్యక్తులు సోషల్ నెట్‌వర్క్‌లు, వెబ్‌సైట్‌లలో చాలా ఉత్తేజకరమైన కథనాలు, వ్యాపార చిట్కాలను పొందవచ్చు. అదేవిధంగా, మీరు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీకు ఇక్కడ చెప్పే ఓ వ్యక్తి జీవితం ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది.
భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ గురించి చాలా మందికి తెలిసి ఉండాలి.ఆయన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, అలాగే ఛైర్మన్. అనిల్ అగర్వాల్‌ను ఇటీవల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి ఆహ్వానించారు. అక్కడ అతను కలల వెంటాడటం గురించి మాట్లాడారు.
చిరు వ్యాపారికి పుట్టిన అనిల్ అగర్వాల్ పాట్నాలోని మార్వాడీ కుటుంబంలో పుట్టి పెరిగాడు. చిన్న వయస్సులోనే, అతను తన తండ్రి వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి 19 సంవత్సరాల వయస్సులో ముంబైకి వెళ్లాడు.
మైనింగ్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ 1970లలో యుక్తవయసులో స్క్రాప్ డీలర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. దీని తర్వాత, 1976 సంవత్సరంలో, అతను స్టెర్లింగ్ కేబుల్ అనే కంపెనీని కొనుగోలు చేశాడు, కానీ ఆ తర్వాత ఆయన వద్ద ఉద్యోగులకు చెల్లించడానికి డబ్బు లేదు. దీని తరువాత, అగర్వాల్ ఈ సంస్థను నడపడానికి మొత్తం 9 వేర్వేరు వ్యాపారాలను ప్రారంభించాడు, అయితే అవన్నీ విఫలమయ్యాయి. దీని తరువాత, 1986 సంవత్సరంలో, టెలిఫోన్ కేబుల్స్ తయారీకి భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ఆమోదించింది. 1980లో స్టార్‌లైట్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేశారు. దీని తరువాత, 1990 సంవత్సరంలో, అతను రాగి శుద్ధి పనిని ప్రారంభించాడు.స్టెరిలైట్ ఇండస్ట్రీస్ దేశంలోనే రాగిని శుద్ధి చేసిన మొదటి ప్రైవేట్ పరిశ్రమ కావడం విశేషం.
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి అనిల్ అగర్వాల్ ఇలా అన్నారు, "నేను నా 20, 30 ఏళ్ల పాటు ఇతరులను చూస్తూ గడిపాను. నేను ఎప్పుడు విజయం సాధిస్తానో తెలియక ఆలోచిస్తున్నాను. 9 విఫలమైన వ్యాపారాలు, సంవత్సరాల తరబడి నిరాశ తర్వాత, నేను నా మొదటి విజయవంతమైన స్టార్టప్‌ని ప్రారంభించాను అని తెలిపారు.
ఎప్పుడూ కాలేజీకి రాని వ్యక్తిగా, వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి ఆహ్వానించబడాలని, విద్యార్థులతో మాట్లాడాలని కలలు కన్నాడు.. అనిల్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. కాలేజీకి, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి ఆహ్వానించబడటం, విద్యార్థులతో మాట్లాడటం కల కంటే తక్కువ కాదు."
అనిల్ అగర్వాల్ నికర విలువ
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియాలో తన ప్రేరణాత్మక పోస్ట్‌లకు విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయనకు ట్విట్టర్‌లో 1,78,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, ఆయన నికర విలువ దాదాపు రూ.16,000 కోట్లు. అతని కుటుంబ నికర విలువ రూ. 32000 కోట్లు. అలాగే , అతని కంపెనీ విలువ రూ.1,48,729 కోట్లుగా ఉంది.