Union Budget 2024-25 ట్యాక్స్ పేయర్స్ కు రూ.17వేలు ఆదా...ఎలాగో తెలుసా? 

By Arun Kumar PFirst Published Jul 23, 2024, 1:11 PM IST
Highlights

ఆల్పాదాయ వర్గాలకు ఆదాయ పన్నునుండి కొంత మినహాయింపు ఇచ్చింది తాజా బడ్జెట్ 2024-25. అదేంటో తెలుసా..? 

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024-24 లో వ్యక్తిగత పన్నుల విధానంలో మార్పులు చేపట్టింది. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయ పన్ను విధించడంలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.  అయితే ఏడాదికి రూ.3-7 లక్షల లోపు ఆదాయం కలిగినివారికి 5 శాతం, రూ.7‌‌-10 లక్షలలోపు ఆదాయం కలిగిన వారికి 10 శాతం పన్ను  విధించనున్నారు.   

పది లక్షలకు పైగా ఆదాయం కలిగినవారికి పన్నులభారం ఎక్కువగానే వుండనుంది. రూ.10-12 లక్షలలోపు ఆదాయముంటే 15 శాతం, రూ.12-15 లక్షల ఆదాయం కలిగినవారికి 20 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయం వుంటే రూ.30 శాతం పన్ను విధించనున్నారు. ఇలా వ్యక్తిగత పన్నుల విధానంలో మార్పులు చేసింది ప్రభుత్వం. 

Latest Videos

ఆదాయ పన్నులో కేంద్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. గతంలో 3-6 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్ వుంటే దాన్ని 3-7 లక్షలకు పెంచింది. అలాగే గతంలో 6-9 లక్షలకు 10 శాతం వుంటే తాజాగా 7-10 లక్షలకు పెంచారు. ఇక 10 లక్షలకు పైగా ఆదాయం కలిగినవారికి ట్యాక్సులు యధావిధిగానే వున్నారు. ఇలా స్వల్పధాయ వర్గాల్ల ట్యాక్సుల మార్పు వల్ల రూ.17 వేల వరకు లబ్ది చేకూరే అవకాశాలున్నాయి. అల్పాధాయ వర్గాలకు లబ్ది చేకూర్చేందుకే కేంద్రం ఈ పన్నుల విధానంలో మార్పులు చేపట్టింది. 


 

click me!