హోం లోన్స్ పై బ్యాంకుల ఫెస్టివల్ ఆఫర్.. మహిళలకు అదనపు తగ్గింపు కూడా..

Ashok Kumar   | Asianet News
Published : Nov 10, 2020, 01:23 PM ISTUpdated : Nov 10, 2020, 10:05 PM IST
హోం లోన్స్ పై బ్యాంకుల ఫెస్టివల్ ఆఫర్.. మహిళలకు అదనపు తగ్గింపు కూడా..

సారాంశం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలను చౌకగా చేసింది, దీంతో వినియోగదారులకు గొప్ప ఉపశమనం లభించనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 

 బ్యాంక్ ఆఫ్ బరోడా తరువాత, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలను చౌకగా చేసింది, దీంతో వినియోగదారులకు గొప్ప ఉపశమనం లభించనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది.

యూనియన్ బ్యాంక్ స్వయంగా ఈ సమాచారాన్ని విడుదల చేసింది. రూ.30 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 0.10 శాతం తగ్గించింది. మహిళా దరఖాస్తుదారులకు రుణాలపై వడ్డీ రేటులో 0.05 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది, అంటే మహిళా దరఖాస్తుదారులకు వడ్డీ 0.15 శాతం తక్కువ అవుతుంది.  

 31 డిసెంబర్ 2020 వరకు గృహ రుణాల ప్రాసెసింగ్ ఫీజును కూడా సున్నాకి  తగ్గించినట్లు బ్యాంక్ తెలిపింది.  

also read దీపావళి సందర్భంగా తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశం.. కొద్ది రోజులు మాత్రమే.. ...

పండుగ సీజన్ దృష్ట్యా వాహనాలు, విద్యా రుణాల ప్రాసెసింగ్ ఫీజులను తొలగించాలని బ్యాంక్ నిర్ణయం తీసుకుంది . "రిటైల్, ఎంఎస్ఎంఇ విభాగాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక ఫైనాన్సింగ్ క్యాంపేన్ ప్రారంభినట్లు" బ్యాంక్ తెలిపింది. రుణగ్రహీతలు బ్యాంకు ఇచ్చే తక్కువ వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ తెలిపింది.

గతవారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బి‌ఓ‌బి) రెపో రేటుతో సంబంధం ఉన్న రుణ వడ్డీ రేటును 7 శాతం నుండి 6.85 శాతానికి తగ్గించింది. బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు 1 నవంబర్ 2020 నుండి అమలులోకి వస్తాయి.

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?