
2025 ఏడాది ఏడు నెలలు పాటూ గడిచిపోయింది. ఇంకా ఐదు నెలలు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది ముగిసిపోక ముందే పొదుపు పనులు మొదలుపెట్టండి. నెలనెలా ఎక్కువ డబ్బు అవసరం లేదు కేవలం అయిదు వందల రూపాయలతోనే ప్రారంభించవచ్చు. భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడే కొన్ని ముఖ్యమైన పనులు చేస్తే, కొన్నేళ్లలో లక్షలు చేతికొచ్చే అవకాశం ఉందని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు. ముఖ్యంగా, కాలేజీ పూర్తి చేసి కొత్తగా ఉద్యోగంలో చేరిన జెన్ Z తరానికి ఇది మంచి ప్రారంభం అని చెప్పుకోవచ్చు. వారు పొదుపు చేసేందుకు సిప్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.
ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న వారి కంటే ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది మంచి సమయం. 2025ని మీ జీవితంలో ‘మార్పు తెచ్చే సంవత్సరం’ అనుకుని పొదుపు మొదలుపెట్టండి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఆదా అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. పాకెట్ మనీ నుంచి లేదా జీతం నుంచి దానిలో కొంత భాగాన్ని ఆదా చేయడం మొదలుపెట్టండి. ఇది మీకు భవిష్యత్తులో ఎన్నో లాభాలను అందిస్తుంది.
డబ్బులను బ్యాంకు ఖాతాలోనే ఉంచడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దాన్ని సురక్షితమైన పెట్టుబడుల్లో పెడితే ఆ డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో దీని ప్రయోజనాలు కనిపిస్తాయి. మొదటి జీతం వచ్చిన వెంటనే, SIP (Systematic Investment Plan) ద్వారా పెట్టుబడిని ప్రారంభిస్తే ఎంతో మంచిది. చాలా మంది ఉద్యోగం వచ్చిన వెంటనే కొన్ని నెలల పాటూ జీతాన్ని ఎంజాయ్ మెంట్ కోసం ఖర్చు చేస్తారు. కానీ, కొంచెం ప్రణాళిక ఉంటే, జీతంలో కనీసం మూడో వంతు ఆదా చేయవచ్చు.
ఉదాహరణకు మీరు నెలకు ₹500 SIP ప్రారంభించండి. ఇదే పెట్టుబడిని 25-30 సంవత్సల పెట్టండి చాలు తరువాత మీరు కోటీశ్వరులు అయిపోతారు. రిటైర్ అయ్యే సమయానికి మీ చేతుల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది. జీతం పెరుగుతున్న కొద్దీ SIP పెట్టుబడిని నెల నెలా పెంచుకుంటూ వెళ్లండి. ఇది ఉత్తమ పెట్టుబడిగా మారుతుంది. దీనితో పాటూ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం కూడా అవసరం. ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు పెట్టుబడిని ఆపకూడదు. కాబట్టి బోనస్ లేదా అదనపు ఆదాయం వచ్చినప్పుడల్లా దాన్ని అత్యవసర నిధి ఖాతాలో ఆదా చేయాలి.
ఇలా చేస్తే పెట్టుబడి ప్రణాళిక అంతరాయం లేకుండా పొదుపు కొనసాగుతుంది. జీతంలో మూడో వంతు ఆదా చేసి దాన్ని రెండు భాగాలుగా విభజించుకోండి. ఒక భాగాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిలో పెట్టడం ఉత్తమం. మరొక భాగాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోండి. ఈ సమతుల్యతతో పొదుపు చేస్తే, ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది. ఆదాయం ప్రారంభమైన వెంటనే ఆదా, పెట్టుబడి ప్రణాళికను పాటిస్తే మీరు కచ్చితంగా కోటీశ్వరులవ్వాలన మీ కల త్వరగా నెరవేరే అవకాశం ఉంది. చిన్న మొత్తంతో ప్రారంభించినా నిరంతరం పెట్టుబడి పెడితే పెద్ద ప్రయోజనం పొందవచ్చు.