ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ: ఏం చేసిందంటే.?

Published : May 09, 2019, 03:22 PM IST
ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ: ఏం చేసిందంటే.?

సారాంశం

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాకిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే ప్రయాణికులకు రాయితీలు కల్పించాలనే ఉద్దేశంతో, ఆర్టీసీలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన క్యాట్ కార్డును రద్దు చేసింది. క్యాట్ కార్డుతోపాటు విహారి, వనిత కార్డులను కూడా రద్దు చేసింది ఆర్టీసీ యాజమాన్యం.

హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాకిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే ప్రయాణికులకు రాయితీలు కల్పించాలనే ఉద్దేశంతో, ఆర్టీసీలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన క్యాట్ కార్డును రద్దు చేసింది. క్యాట్ కార్డుతోపాటు విహారి, వనిత కార్డులను కూడా రద్దు చేసింది ఆర్టీసీ యాజమాన్యం.

ప్రయాణికుల ఆదరణ తగ్గడంతో కార్డులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసి ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేందుకు తొలుత క్యాట్ కార్డ్ పరిచయం చేశారు. 

ఏడాదికి రూ. 250 చెల్లించి కార్డు తీసుకుంటే.. ఏసీ బస్సు మినహా అన్ని బస్సుల్లోనూ 10శాతం రాయితీ లభించేది. ఇదే కార్డును రెన్యూవల్ చేసుకోవాలనుకుంటే రూ. 150 చెల్లిస్తే సరిపోయేది. దీంతో ఈ కార్డుకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అన్ని వర్గాల నుంచి డిమాండ్ రావడంతో ఏడాదికి 5-6లక్షల వరకు కార్డులు అమ్ముడుపోయేవి. 

ఉమ్మడి ఏపీలో ఈ కార్డుకు గిరాకీ బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో కొంత డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో కార్డులపై ఓ ఆర్టీసీ కమిటీ అధ్యయనం చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై సమావేశమైన ఆర్టీసీ ఉన్నతాధికారులు క్యాట్, విహారి, వినతా కార్డులను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.

మే 1 నుంచి ఈ కార్డులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాట్, వనతి, విహారి కార్డుల ద్వారా ఆర్టీసీకి ఏటా రూ. 5కోట్ల వరకు రాబడి వచ్చేది. పేద ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన వనిత కార్డు కేవలం రూ. 100 చెల్లిస్తే రెండేళ్లపాటు 10శాతం రాయితీతో ప్రయాణించే అవకాశం ఉండేది. 

ఇక రూ. 610 చెల్లించి విహారి కార్డును కొంటే ఏడు రోజులపాటు 50శాతం రాయితీతో రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించే వెసులుబాటు ఉండేది. ఈ మూడు కార్డులతో ఆర్టీసీకి మంచి రాబడే వచ్చేది. కానీ, ఆర్టీసీ అధికారులు రద్దు చేయడంతో ఇప్పటికీ ఈ కార్డులను ఉపయోగిస్తున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్డులను కొనసాగిస్తే బాగుంటుందని వారంటున్నారు. కార్డుల రద్దుపై ఆర్టీసీ యాజమాన్యం పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Gold : బంగారం పై అమెరికా దెబ్బ.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !