కొత్త టూ వీలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే గత నెల మే 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 బ్రాండ్‌ల వివరాలు తెలుసుకుందాం. తద్వారా మార్కెట్లో ఏ బైక్ ఎక్కువగా అమ్ముడవుతుందో తెలుసుకునే వీలు మీకు కలగుతుంది. గత నెల భారీగా అమ్మడు పోయి టాప్ సేల్స్ అందుకున్న బైక్ కంపెనీల్లో హీరో మోటోకార్ప్ నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ వరకు టూ వీలర్ బ్రాండ్‌లు ఉన్నాయి.
గత నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన బైక్స్ లో చూసినట్లయితే ప్రస్తుతం హీరో మోటార్ కార్ కు చెందిన Hero Passion Pro XTEC అత్యధిక సేల్స్ అందుకుంది. మే 2023లో టూ వీలర్ అమ్మకాల గణాంకాలు చూసినట్లయితే, మే నెలలో 14.71 లక్షల యూనిట్లను విక్రయించాయి. 2022 సంవత్సరంలో విక్రయించిన ద్విచక్ర వాహనాల సంఖ్య 12.53 లక్షలు కాగా, గత ఏడాది కంటే మే నెలలో 17.4 శాతం ఎక్కువ. మే నెలలో డేటా ప్రకారం హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్ , రాయల్ ఎన్‌ఫీల్డ్ బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్‌లుగా నిలిచాయి. మీరు కొత్త బైక్ లేదా స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మే నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 5 టూ వీలర్ బ్రాండ్స్ పూర్తి సేల్స్ రిపోర్టును తెలుసుకుందాం.
Hero MotoCorp: Hero MotoCorp మే 2023లో ద్విచక్ర వాహనాల విక్రయాలలో మొదటి స్థానాన్ని నిలుపుకుంది. మే నెలలో కంపెనీ 5,08,309 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఏప్రిల్‌లో కంపెనీ 4,66,466 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. హీరో మోటోకార్ప్ ఏడాది ప్రాతిపదికన 8.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Honda: హోండా తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ హోండా యాక్టివాను అప్‌డేట్ చేయడమే కాకుండా, మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడానికి హోండా షైన్ తేలికపాటి వేరియంట్‌ను కూడా విడుదల చేసింది . హోండా మే 2023లో తన ద్విచక్ర వాహన శ్రేణి నుండి 3,11,144 యూనిట్లను విక్రయించగా, మే 2022లో కంపెనీ తన ద్విచక్ర వాహన శ్రేణిలో 3,20,857 యూనిట్లను విక్రయించింది. 3 శాతం నెగిటివ్ అమ్మకాలతో కంపెనీ రెండో స్థానాన్ని ఆక్రమించింది.
TVS Motor: TVS మోటార్ స్కూటర్లు, బైక్‌లతో టూ వీలర్ సెక్టార్‌లో ఉంది, ఇది మే 2023లో మూడవ అత్యధికంగా అమ్ముడైన కంపెనీగా అవతరించింది. TVS మే 2023లో 2,52,690 ద్విచక్ర వాహనాలను విక్రయించగా, మే 2022లో కంపెనీ 1,91,482 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.
బజాజ్ ఆటో: మే 2022లో 96,102 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, బజాజ్ ఆటో మే 2023లో 1,94,684 స్కూటర్లు , బైక్‌లను విక్రయించింది, మేలో కంపెనీని నాల్గవ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. కంపెనీ ఏడాది ప్రాతిపదికన 102.5 శాతం వృద్ధిని సాధించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ : రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యధిక సంఖ్యలో క్రూయిజర్ బైక్‌లను కలిగి ఉన్న కంపెనీ, ఇది మే 2023లో ఐదవ స్థానంలో ఉంది. ఈ నెలలో, కంపెనీ దేశీయ మార్కెట్లో 70,795 యూనిట్లను విక్రయించగా, మే 2022లో కంపెనీ 53,525 యూనిట్లను విక్రయించింది.