
ప్రస్తుతం చాల మంది కొత్త ఏడాది 2024ని స్వాగతించేందుకు బిజీ ఉన్నారు. కాబట్టి ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించడం మంచిది. ఈ సంవత్సరం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) గురించి సమాచారాన్ని పొందటం చాలా ముఖ్యం. అయితే గతంలో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు చేసిన పొరపాట్లను తెలుసుకోవడంతోపాటు నెక్స్ట్ ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు. 2023 సంవత్సరంలో మొత్తం 120 ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లు (IPOలు) జరిగాయి. ఇందులో 61 SME IPOలు ఉన్నాయి. 2022 సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం గరిష్టంగా IPO జరిగింది. 2022లో 90 IPOలు జరిగాయి.
2023లో జరిగిన 120 IPOలలో 95 రికార్డు లిస్టింగ్‌ను సాధించాయి. మరో 24 లిస్టింగ్ తేదీలో నష్టాలను చూపించాయి. మరోకొన్ని IPOలు ఇంకా లిస్ట్ చేయబడలేదు. ఈ సంవత్సరం జరిగిన మొత్తం IPOలలో 102 ఇష్యూ ధర ఆధారంగా ప్రస్తుతం లాభదాయకంగా ఉన్నాయి. మరో 17 ఇష్యూ ధరతో పోలిస్తే నష్టాల్లో ఉన్నాయి.
2023 టాప్ IPOలు
లిస్టింగ్ ఆదాయాల ఆధారంగా 2023 టాప్ IPOలు:
గోయల్ సాల్ట్: ఈ IPO 267 సార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడింది. అలాగే అక్టోబర్ 11 న లిస్ట్ కాగా, ఈ IPO 258.2% లిస్టింగ్ లాభం పొందింది.
సన్ గార్నర్ ఎనర్జీస్: ఈ IPO 138.2 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఆగస్టు 31 న లిస్ట్ కాగా ఈ IPO 216.1 శాతం లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.
బాసిలిక్ ఫ్లై స్టూడియో: ఈ IPO 286.6 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడింది. సెప్టెంబర్ 11న లిస్ట్ కాగా ఈ IPO 193.3% లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.
ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్: ఈ IPO 502.6 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ IPO డిసెంబర్ 29న లిస్ట్ కాగా ఈ IPO 180.4 శాతం లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.
ఒరియానా పవర్: ఈ IPO 117.4 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఆగస్టు 11 న లిస్ట్ కాగా ఈ IPO 168.7 శాతం లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.
అన్‌లోన్ టెక్నాలజీస్ సొల్యూషన్స్: ఈ IPO 428.5 సార్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. జనవరి 23 న లిస్ట్ కాగా ఈ IPO 163.7 శాతం లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.
టాటా టెక్నాలజీస్: ఈ IPO 69.4 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. నవంబర్ 30 న లిస్ట్ కాగా ఈ IPO 162.6 శాతం లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.
CPS షేపర్స్ : ఈ IPO 236.7 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడింది. సెప్టెంబర్ 7 న లిస్ట్ కాగా ఈ IPO 155.4 శాతం లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.
శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ : ఈ IPO 418.4 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. లిస్టింగ్ ఆగస్టు 18న కాగా ఈ IPO 153.7 శాతం లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.
ఇన్ఫోలియోన్ రీసెర్చ్ సర్వీస్: ఈ IPO 259.1 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. జూన్ 8 న లిస్ట్ కాగా ఈ IPO 142.1 శాతం లిస్టింగ్ లాభాన్ని నమోదు చేసింది.