
అమెజాన్ ఇండియా వేసవి సేల్‌కు సిద్ధమవుతోంది. వినియోగదారుల కోసం మే 1న మధ్యాహ్నం 12 గంటలకు గ్రేట్ సమ్మర్ సేల్ 2025ని ప్రారంభిస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లు, ఇతర ఐటమ్స్ పై భారీ తగ్గింపులు ఉంటాయని ప్రకటించింది. మీరు ప్రైమ్ సభ్యులైతే మీకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ముందస్తు యాక్సెస్ అర్ధరాత్రి ప్రారంభమై 12 గంటల పాటు ఉంటుంది.
అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్‌లపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ప్రోత్సాహకాలు, ఉచిత EMI ఎంపికలతో పాటు సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గాడ్జెట్స్ పై 40% వరకు తగ్గింపు ఉండవచ్చని అమెజాన్ సూచించింది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి టైం. తక్కువ ధరల్లో లభించే స్మార్ట్‌ఫోన్‌ల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటైన Samsung Galaxy S24 Ultra 5G మీకు భారీ తగ్గింపుతో లభించనుంది. దీని ధర రూ.1,34,999 కాగా, అమెజాన్ ఇండియా వేసవి సేల్ లో రూ.84,999లకే లభిస్తుంది. Galaxy S24 Ultra అద్భుతమైన Snapdragon 8 Gen 3 CPU, 200 MP కెమెరా సెటప్, హై ఎండ్ నిర్మాణం, పూర్తి ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ను అందిస్తుంది.
అందుబాటు ధరకు మీకు ఫ్లాగ్‌షిప్ సామర్థ్యాలతో ఉన్న మిడ్ రేంజర్ ఫోన్ కావాలంటే మీరు OnePlus Nord 4ను ఎంపిక చేసుకోండి. అమెజాన్ సేల్ లో Nord 4 కేవలం రూ.24,999కి లభిస్తుంది. ఇది 6.74 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 7+ Gen 3 CPU, 5500 mAh బ్యాటరీని కలిగి ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కావాలనుకొనే వారికి నోట్ ప్లస్ బెస్ట్ సెలెక్షన్ అవుతుంది.
మంచి పనితీరు కావాలనుకున్న ఫోన్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఎంపిక iQOO Neo 10R. ఇది అమెజాన్‌లో ప్రత్యేక సేల్ ధర రూ. 24,999కి లభిస్తుంది. ఇందులో బ్యాంక్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉంటాయి. Neo 10R స్నాప్ డ్రాగన్ 8s Gen 3 CPU, 6400 mAh బ్యాటరీ, వేగంగా ఛార్జింగ్ చేసే పరికరాలను కలిగి ఉంది. ఇది గేమింగ్, ఇంటెన్సివ్ మల్టీ టాస్కింగ్ కోసం తయారైన ప్రత్యేకమైన ఫోన్.
మీరు మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే OnePlus 13R మంచి ఆప్షన్. అమెజాన్ వేసవి సేల్ లో ఇది కేవలం రూ.39,999కి లభిస్తుంది. అదనపు ప్రయోజనంగా కస్టమర్‌లకు రూ.3,999 విలువైన ఉచిత OnePlus Buds 3 కూడా లభిస్తుంది. 6000 mAh బ్యాటరీ, 6.78 అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తదితర ఫీచర్లు ఈ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణ.
Xiaomi నుంచి వచ్చిన 14 CIVI అనేక డిస్కౌంట్ లతో అమెజాన్ సేల్ లో కేవలం రూ. 39,999 లభిస్తుంది. దీని స్మూత్ డిజైన్, Leica కెమెరాలు, స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3, 6.55 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కారణంగా 14 CIVI బెస్ట్ ఎంపిక అని చెప్పొచ్చు.
స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు వంటి వివిధ పరికరాలపై కూడా గణనీయమైన తగ్గింపులను అమెజాన్ ప్రకటించింది. Xiaomi Smart TV A Pro 4K 43 అంగుళాల టీవీ కేవలం రూ. 23,999కే లభిస్తుంది. ICICI బ్యాంక్ అమెజాన్ పే కస్టమర్‌లు అదనంగా 5% క్యాష్‌బ్యాక్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు.
ఇది కూడా చదవండి మీకు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా? రూ.30,000 లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే