స్టాక్ మార్కెట్ బౌన్స్, సెన్సెక్స్ 350 పాయింట్లు పెరుగుదలతో అన్ని రంగాలు విజృంభణ

By Sandra Ashok KumarFirst Published Nov 23, 2020, 11:47 AM IST
Highlights

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  సెన్సెక్స్ 44232.34 స్థాయిలో 350.09 పాయింట్లతో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 95 పాయింట్ల (0.74 శాతం) లాభంతో 12954 వద్ద ప్రారంభమైంది. ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, డెరివేటివ్స్ కాంట్రాక్టుల పరిష్కారం మీద ఆధారపడి ఉంటుంది.

నేడు వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్ మీద ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  సెన్సెక్స్ 44232.34 స్థాయిలో 350.09 పాయింట్లతో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 95 పాయింట్ల (0.74 శాతం) లాభంతో 12954 వద్ద ప్రారంభమైంది.

ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, డెరివేటివ్స్ కాంట్రాక్టుల పరిష్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉంటాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు సంబంధించిన వార్తలే కాకుండా, యుఎస్‌లో ప్రోత్సాహక చర్యల చర్చలు, ప్రపంచ ధోరణి మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని నిపుణులు తెలిపారు.  

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) ఈ నెలలో ఇప్పటివరకు 49,553 కోట్ల రూపాయలను భారత మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయగా, గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం తెలిసిందే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై గందరగోళం తరువాత గ్లోబల్ ఇండెక్స్ లు మెరుగుపడ్డాయి, ఇది భారత మార్కెట్లలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు పెరగడానికి దారితీసింది.  

టాప్ 10లో ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గాయి. ఈ ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) గత వారం 1,07,160 కోట్ల రూపాయలు క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది.

also read 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), హిందుస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా క్షీణించాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. 

గత వారం బిఎస్ఇ సెన్సెక్స్ 439.25 పాయింట్లు లాభపడింది. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్ అస్థిరత మరింత కొనసాగుతుందని అందువల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. 

నేడు బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, గెయిల్ షేర్లు వేగంగా ప్రారంభమయ్యాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, ఎస్‌బి‌ఐ లైఫ్ షేర్లు రెడ్ మార్క్ మీద ప్రారంభమయ్యాయి.

  నేడు అన్ని రంగాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. వీటిలో ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రియాల్టీ, ఐటి, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, పిఎస్‌యు బ్యాంకులు ఉన్నాయి.

ప్రీ-ఓపెన్ సమయంలో స్టాక్ మార్కెట్  సెన్సెక్స్ ఉదయం 9.01 గంటలకు 131.97 పాయింట్లు పెరిగి 44,014.22 వద్దకు చేరుకుంది. అలాగే  నిఫ్టీ 26.60 పాయింట్లు పెరిగి 12,885.60 వద్ద ఉంది.

స్టాక్ మార్కెట్ శుక్రవారం గ్రీన్ మార్క్ మీద ప్రారంభమై సెన్సెక్స్ 129.66 పాయింట్లతో 43729.62 వద్ద, నిఫ్టీ 38.80 పాయింట్ల (0.3 శాతం) లాభంతో 12810.50 వద్ద ప్రారంభమైంది.

click me!