Todays Petrol Diesel Prices: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 16, 2022, 09:00 AM IST
Todays Petrol Diesel Prices: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

సారాంశం

దేశంలోని  అన్నీ మెట్రో నగరాల్లో వరుసగా 45 రోజుల పాటు ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై వాల్యు ఆధారిత పన్ను(VAT)ను 30 శాతం  నుండి 19.40 శాతానికి తగ్గించింది.

దేశంలోని  అన్నీ మెట్రో నగరాల్లో వరుసగా 45 రోజుల పాటు ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై వాల్యు ఆధారిత పన్ను(VAT)ను 30 శాతం  నుండి 19.40 శాతానికి తగ్గించింది. మరోవైపు విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా ప్రతి రాష్ట్రానికి ఇంధన ధరలు మారుతూ ఉంటాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి.

అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌తో సహా అనేక అంశాలు ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం ముడి చమురు ధరలు రెండు రోజుల వరుస లాభాల తర్వాత గురువారం తగ్గుదలని గమనించాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6 సెంట్లు లేదా 0.1% తక్కువగా ఉంది, బ్యారెల్ మార్కుకు 84.61 వద్ద ట్రేడవుతోంది, అయితే యూ‌ఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 7 సెంట్లు తగ్గి, బ్యారెల్‌కు 82.57 డాలర్లకు దగ్గర ఉంది.

ఢిల్లీ పెట్రోలు ధర  లీటరుకు రూ. 95.41, డీజిల్ లీటరుకు రూ. 86.67

చెన్నై పెట్రోలు ధర  లీటరుకు రూ. 101.40, డీజిల్ ధర   లీటరుకు రూ. 91.43

కోల్‌కతా పెట్రోలు ధర  లీటరుకు రూ. 104.67, డీజిల్ ధర  లీటరుకు రూ. 89.79

త్రివేండ్రం పెట్రోలు ధర  లీటరుకు రూ. 106.36, డీజిల్ ధర లీటరుకు రూ. 93.47

హైదరాబాద్ పెట్రోలు ధర లీటరుకు రూ. 108.20, డీజిల్ ధర లీటరుకు రూ. 94.62

బెంగళూరు పెట్రోలు ధర లీటరుకు రూ. 100.58, డీజిల్ ధర లీటరుకు రూ. 85.01

జైపూర్ పెట్రోలు ధర  లీటరుకు రూ. 107.06, డీజిల్ ధర  లీటరుకు రూ. 90.70

లక్నో పెట్రోలు ధర లీటరుకు రూ. 95.28, డీజిల్ ధర లీటరుకు రూ. 86.80

భువనేశ్వర్ పెట్రోలు ధర లీటరుకు రూ. 101.81, డీజిల్ ధర లీటరుకు రూ. 91.62

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో మార్పు నేరుగా దేశీయ మార్కెట్లో  చమురు ధరను ప్రభావితం చేస్తుంది. భారత దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణమైన ముఖ్యమైన కారకాల్లో ఇది ఒకటి. అంతర్జాతీయ డిమాండ్ పెరుగుదల, తక్కువ ఉత్పత్తి రేటు అలాగే ప్రపంచంలోని ముడి చమురు ఉత్పత్తి దేశాలలో ఏదైనా రాజకీయ అశాంతి పెట్రోలు ధరను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భారతదేశం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక వృద్ధి కూడా పెట్రోల్, ఇతర ముఖ్యమైన ఇంధనాలకు డిమాండ్ పెరగడానికి దారితీసింది. 

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!