బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. దిగోస్తున్న పసిడి.. నేడు ధర ఎంత తగ్గిందంటే..?

By asianet news teluguFirst Published Nov 1, 2022, 12:15 PM IST
Highlights

హైదరాబాద్ లో వెండి గురించి మాట్లాడినట్లయితే నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి . ఈరోజు ఒక గ్రాము వెండి ధర రూ.63 ఉండగా, నిన్నటి ధర కూడా ఒకేలా ఉంది. ఒక కేజీ వెండి ధర నేడు రూ.63,000 కాగా, నిన్నటి ధర కూడా వర్తిస్తుంది. 

నేడు బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే  పసిడి కొనాలనుకునే వారికి మంచి ఛాన్స్ గా చెప్పవచ్చు. ఈ రోజు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో బంగారం ధరలు నామమాత్రంగా రూ.160 తగ్గాయి. నవంబర్ 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50,840 వద్ద ట్రేడవుతుండగా, నిన్న అంటే సోమవారం రూ.51,000గా ఉంది. 22 క్యారెట్ల బంగారం కూడా రూ.150 తగ్గి రూ.46,600 వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు నేడు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.1 కిలో వెండి ప్రస్తుతం రూ.57,500 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో కిలో వెండి రూ.57,500గా ఉండగా, చెన్నైలో ప్రస్తుతం రూ.63,000గా ట్రేడవుతోంది.

హైదరాబాద్ లో వెండి గురించి మాట్లాడినట్లయితే నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి . ఈరోజు ఒక గ్రాము వెండి ధర రూ.63 ఉండగా, నిన్నటి ధర కూడా ఒకేలా ఉంది. ఒక కేజీ వెండి ధర నేడు రూ.63,000 కాగా, నిన్నటి ధర కూడా వర్తిస్తుంది. అంటే ధరల్లో తగ్గుదల, పెరుగుదల ఏమీ లేదు.  

స్పాట్ బంగారం ఔన్సుకు $1,633.69 డాలర్ల వద్ద 0059 GMT నాటికి అక్టోబర్ 21 నుండి కనిష్ట స్థాయిని తాకింది. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.2% పెరిగి $19.18 డాలర్లకి, ప్లాటినం 0.1% తగ్గి $924.51 డాలర్లకి, పల్లాడియం $1.85% పెరిగింది.

22 అండ్ 24 క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసం
 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయితే, 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు చేయలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తారు.


నగరం     22-క్యారెట్     24-క్యారెట్ 
చెన్నై      రూ.47,140    రూ.51,430
ముంబై    రూ.46,590    రూ.50,830
ఢిల్లీ        రూ.46,740    రూ.50,980
కోల్‌కతా   రూ.46,590    రూ.50,830
బెంగళూరు    రూ.46,640    రూ.50,900
హైదరాబాద్   రూ.46,590    రూ.50,830
నాసిక్     రూ.46,620    రూ.50,860
పూణే      రూ.46,620    రూ.50,860
వడోదర   రూ.46,620    రూ.50,860
అహ్మదాబాద్    రూ.46,640    రూ.50,900
లక్నో      రూ.46,740    రూ.50,980
చండీగఢ్         రూ.46,740    రూ.50,980
సూరత్    రూ.46,640    రూ.50,900
విశాఖపట్నం   రూ.46,590    రూ.50,830
భువనేశ్వర్      రూ.46,600    రూ.50,830
మైసూర్     రూ.46,640    రూ.50,900

పైన లిస్ట్ లో పేర్కొన్న ధరలు స్థానిక ధరలకు సమానంగా ఉండకపోవచ్చు.  ఈ ధరలు TDS, GST అండ్ ఇతర పన్నులను చేర్చకుండా చూపుతుంది. అలాగే భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకి  చెందినవి.

click me!