తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రామూలకు ఎంతంటే?

By Sandra Ashok KumarFirst Published Jul 8, 2020, 12:53 PM IST
Highlights

కరోనా వైరస్ కేసుల పెరుగుదల గణనీయంగా నష్టాలను నమోదు చేసింది. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 7.4 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం ఇండియా కరోనా వైరస్ కేసులలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. 


న్యూ ఢీల్లీ: ఆర్థిక పరిస్థితులు వేగంగా కోలుకోవాలనే ఆశతో పెట్టుబడిదారులలో రిస్క్ పెరగడంతో బంగారం, వెండి బుధవారం వాణిజ్య ప్రారంభంలో లాభాలను చూసింది. కానీ కరోనా వైరస్ కేసుల పెరుగుదల గణనీయంగా నష్టాలను నమోదు చేసింది.

 భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 7.4 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం ఇండియా కరోనా వైరస్ కేసులలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. ఈ కరోనా మహమ్మారి వల్ల  20,600 మందికి పైగా మరణించారు. గోల్డ్ ఫ్యూచర్స్ 0.19 శాతం లేదా రూ .95 తగ్గి 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.48,705 వద్ద ఉంది.

 సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 0.22 శాతం లేదా రూ .112 తగ్గి రూ.50,090 రూపాయలకు చేరుకుంది. రూపాయి విలువ తగ్గింపు మధ్య మంగళవారం దేశ రాజధానిలో బంగారం ధరలు 10 గ్రాములకి రూ .210 పెరిగి 49,228 రూపాయలకు చేరుకున్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది.

also read 

అయితే వెండి రూ.249 రూపాయలు తగ్గి కిలోకు 50,573 రూపాయలకు చేరుకుంది. స్పాట్ బంగారం ఔన్సుకు 1,792.79 డాలర్లుకు  చేరింది, నవంబర్ 2011 నుండి మంగళవారం అత్యధికంగా 1,796.93 డాలర్లను తాకింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి 1,805.70 డాలర్లకు చేరుకుంది

. ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ మంగళవారం 0.7 శాతం పెరిగాయి. పల్లాడియం ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,921.69 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం స్థిరంగా 835.45 డాలర్లకు చేరుకుంది, వెండి 0.1 శాతం కోల్పోయి 18.28 డాలర్లకు పడిపోయింది.

ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ఔన్స్‌ బంగారం ధర 4డాలర్లు నష్టాన్ని చవిచూసి 1,805.85డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుతానికి బంగారం ధర దిగివచ్చినప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తక్కువ వడ్డీరేట్లు, ఉద్దీపన ప్యాకేజీలతో బంగారం ధర మరింత ర్యాలీ చేస్తుందని వారంటున్నారు. 

click me!