అల్ టైం హై నుంచి దిగోచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Jul 4, 2020, 1:24 PM IST
Highlights

ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఇతర ఛార్జీలు వల్ల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వినియోగదారి అయిన భారతదేశంలో నేటి బంగారు ఆభరణాల ధరలు ఇలా  ఉన్నాయి. న్యూ ఢీల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,150 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో బంగారం ధర 10 గ్రాములకు రూ .46,270కు పడిపోయింది.

ఈ రోజు బంగారం ధర 10 గ్రాములకు 48,350 రూపాయలుగా ఉండగా, వెండి కిలోకు 48,600 రూపాయల నుండి 50 రుపాయాయలు తగ్గి 48,550 రూపాయలకు చేరుకుంది. ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఇతర ఛార్జీలు వల్ల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వినియోగదారి అయిన భారతదేశంలో నేటి బంగారు ఆభరణాల ధరలు ఇలా  ఉన్నాయి.

న్యూ ఢీల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,150 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో బంగారం ధర 10 గ్రాములకు రూ .46,270కు పడిపోయింది. ముంబైలో తులం బంగారానికి  రూ .46,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,880. ఎంసిఎక్స్‌లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 0.23 శాతం తగ్గి 10 గ్రాములకు రూ .48,046కు చేరుకుంది.

సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కూడా వెండి ధర కిలోకు 49,177 రూపాయలకు పడిపోయింది.  శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే 10గ్రాముల బంగారం ధర రూ.112లు నష్టపోయి రూ.48046 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 3నెలల గరిష్టంపైన స్థిరపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు గరిష్టస్థాయిల లాభాల స్వీకరణతో బంగారం ధర స్వల్ప నష్టాన్ని చవిచూసింది.

also read వరుసగా 3వ రోజు దిగోచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే ? ...

వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా నుండి వచ్చిన సమాచారం ప్రకారం కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) పై ప్రభావం చూపే బంగారు దిగుమతులు 2020-21 మొదటి రెండు నెలల్లో గణనీయంగా 79.14 మిలియన్ డాలర్లకు పడిపోయాయి, కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ గణనీయంగా తగ్గింది.

2019-20 మధ్య కాలంలో బంగారం దిగుమతులు 8.75 బిలియన్లుగా ఉన్నాయి. అయితే రికార్డు స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో రూ.936 క్షీణతను చవిచూసింది. వారం మొత్తం మీద రూ.259లు లాభపడింది. అలాగే ఈ ఏడాది ప్రథమార్థంలో బంగారం ధర 25శాతం ర్యాలీ చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర స్వల్ప నష్టంతో ముగిసింది. నిన్నటిరోజున బంగారం ధర 2.50డాలర్ల స్వల్ప నష్టంతో 1,787.60డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారంలో బంగారం ధర 1,801 డాలర్ల వద్ద 8ఏళ్ల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. హైదరబాద్ లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,850.00.

click me!