పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వినియోగదారులకు ఇబ్బందులు.. ప్రభుత్వం ఎంత పన్ను విధిస్తుందో తెలుసా ..

By S Ashok KumarFirst Published Dec 9, 2020, 1:33 PM IST
Highlights

ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు. 83.71 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.73.87 వద్ద ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.

వరుస ఏడు రోజుల పెంపు తరువాత నేడు పెట్రోల్, డీజిల్ ధరలు అంటే డిసెంబర్ 9 స్థిరంగా ఉన్నాయి. ఢీల్లీలో ఈ రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్ ధర లీటరుకు రూ.83.71 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.73.87వద్ద ఉంది.

దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ముంబైలో పెట్రోల్ ధర రూ.90.34 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.80.51 ఉంది.   గత 19 రోజుల్లో ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుపై  రూ.2.65, డీజిల్ ధర పై లీటరుకు రూ.3.40 పెరిగాయి. ముంబైలో ఇంధన ధరలు అన్నీ ఇతర  మెట్రో నగరాల కంటే అత్యధికంగా ఉంది.  

ప్రస్తుతం, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం  దేశంలో అత్యధిక ఇంధన కేంద్రాలను కలిగి ఉన్నాయి.

also read 

ఇంధన ధరలను ప్రతిరోజూ ఉదయం 6 సమీక్షిస్తాయి, ధరలలో ఏవైనా మార్పులు ఉంటే అమలు చేస్తాయి. స్థానిక పన్నుల కారణంగా ఇంధన రేట్లు రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. 

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 48.84 డాలర్ల వద్ద ఉంది. యు.ఎస్. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 16 సెంట్లు తగ్గి 45.60 డాలర్ల వద్ద స్థిరపడింది. రాబోయే రోజుల్లో ముడి చమురు అదే స్థాయిలో ఉన్నప్పటికీ, రిటైల్ ధరలు దేశంలో మరింత పెరుగుతాయని ఊహిస్తున్నారు.

పెరుగుతున్న చమురు ధరలతో వినియోగదారులు కలత చెందుతున్నారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధిక స్థాయికి చేరాయి.  గత 18 రోజుల్లో పెట్రోల్ ధర సుమారు 4 శాతం, డీజిల్ 5 శాతం పెరిగింది.  కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై సానుకూల వార్తలు త్వరలో ఆర్థిక వ్యవస్థకు తిరిగి గాడిలోకి తెస్తాయని భావిస్తున్నారు.  

చమురుపై  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను రేటు చాలా ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ 63 శాతం ఉండగా, డీజిల్‌ పై 60 శాతం ఉన్నాయి.  

click me!