వాహనదారులపై మళ్ళీ పెట్రోలు బాదుడు.. వరుసగా 6 రోజు పెంపు..

By Sandra Ashok KumarFirst Published Aug 25, 2020, 12:02 PM IST
Highlights

 నేటి పెంపుతో గత పది రోజుల్లో పెట్రోల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారు. పెట్రోల్ లీటరుకు 9-11 పైసలు పెంచినట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్స్ తెలిపింది.

దేశీయ పెట్రోల్ ధరలను మంగళవారం వరుసగా 6 రోజు అనగా ఆగస్టు 25న మళ్ళీ పెంచారు, అయితే డీజిల్ రేట్లలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేవు. నేటి పెంపుతో గత పది రోజుల్లో పెట్రోల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారు. పెట్రోల్ లీటరుకు 9-11 పైసలు పెంచినట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్స్ తెలిపింది.

ఢీల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో ఆగస్టు 25 ఉదయం 6 నుంచి పెంచిన పెట్రోల్ ధరలు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.81.62 నుండి. 81.73కు పెంచగా, డీజిల్ ధర లీటరుకు రూ.73.56 వద్ద స్థిరంగా ఉన్నాయి. దాదాపు ఒక నెలరోజుల నుంచి డీజిల్ ధరలో మార్పులేదు.  


ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.81.73, డీజిల్ ధర  రూ.73.56
కోల్‌కతా  పెట్రోల్ ధర  రూ.83.24, డీజిల్ ధర  రూ.77.06
ముంబై పెట్రోల్ ధర  రూ.88.39, డీజిల్ ధర రూ. 80.11

also read  అమెజాన్ పే కొత్త సర్వీస్.. కేవలం రూ.5 బంగారాన్ని కొనొచ్చు.. ...

చెన్నై పెట్రోల్ ధర రూ.84.73, డీజిల్ ధర రూ.78.86
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.94, డీజిల్ ధర  రూ.80.17 
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.84.39, డీజిల్ ధర రూ.77.88 

ఆసియా , ఐరోపాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుఎస్ గల్ఫ్ తీరంలో వ్యాపారులు భారీగా ఉత్పత్తి కోతలు  విధించడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని  ఒక వార్తా సంస్థ తెలిపింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలో  అత్యధిక ఇంధన కేంద్రాలను కలిగి ఉన్నాయి.

ఇవి ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లను సమీక్షిస్తాయి. ఇంధన ధరల్లో  ఏదైనా మార్పులు ఉంటే ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. ముడి చమురు ధర, విదేశీ మారకపు రేటు, స్థానిక పన్నులు వంటి కారణాల వల్ల ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంధన ధరలు మారుతూ ఉంటాయి.

click me!