షాక్ మీద షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు...వరుసగా మళ్ళీ పెంపు..

By Sandra Ashok KumarFirst Published Jun 26, 2020, 12:42 PM IST
Highlights

నేడు శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 22 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 83.18 రూపాయలు, డీజిల్  ధర లీటరుకు రూ.78.19 చేరింది. 

పెట్రోల్, డీజిల్ ధరల మంట రోజు రోజుకి కొనసాగుతూనే ఉంది. నేడు శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 22 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది.

పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 83.18 రూపాయలు, డీజిల్  ధర లీటరుకు రూ.78.19 చేరింది. అయినప్పటికీ, ఇతర మెట్రో నగరాలైన కోల్‌కతా, ముంబై మరియు చెన్నైలలో డీజిల్ రేట్ల కంటే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

శుక్రవారం మెట్రో నగరరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు వరుసగా నేడు మళ్ళీ పెరిగాయి, ఢిల్లీలో పెట్రోల్ కంటే డీజిల్ ధర వరుసగా మూడవ రోజు కూడా పెరిగింది. 12 వారాల విరామం తరువాత ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు రోజువారీ సమీక్షల తరువాత తాజా పెంపుతో డీజిల్ ధరలు వరుసగా 20 రోజులు పాటు పెరుగుతూనే ఉంది.

దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు ఉదయం 6 నుంచి రూ .79.92 నుండి రూ .80.13కు చేరింది, డీజిల్ ధర లీటరుకు రూ .80.02 నుండి లీటరుకు రూ .80.19 కు పెంచారు. 

మెట్రో నగరాలలో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:

ఢిల్లీ  పెట్రోల్ 80,13, డీజిల్80,19
కోల్‌కతా పెట్రోల్ 81.82, డీజిల్ 75.34
ముంబై పెట్రోల్ 86.91, డీజిల్ 78.51
చెన్నై పెట్రోల్ 83.37, డీజిల్ 77.44

ఇక పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు పెట్రో ధరలను మించి డీజిల్‌ ధర పరుగులు తీయడంతో నిత్యావసరాల ధరలూ చుక్కలు చూస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.మెట్రో నగరాలైన కోల్‌కతా, ముంబై, చెన్నైలలో డీజిల్ రేట్ల కంటే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

జూన్ 7న, దేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం దేశంలో ఎక్కువ శాతం పెట్రోల్, డీజిల్ అవుట్లెట్లను కలిగి ఉన్నాయి. 82 రోజుల లాక్ డౌన్ తరువాత ఖర్చులకు అనుగుణంగా రోజువారీ ఇంధన ధర సమీక్షలు సాధారణ వ్యవస్థను పున ప్రారంభించింది.

దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు ముడి చమురు విదీశీ రేట్ల ద్వారా నిర్ణయించబడతాయి. వాల్యూ ఆధారిత పన్ను (వ్యాట్) కారణంగా వేరు వేరు రాష్ట్రాలలో ఇంధన ధరలు మారుతూ ఉంటాయి.

click me!