Todays Gold Rate: దేశంలో నేటి బంగారం ధరల వివ‌రాలివే..!

By team teluguFirst Published Jan 16, 2022, 11:31 AM IST
Highlights

 పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా..డిమాండ్, కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.

 పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా..డిమాండ్, కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతుంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, బులియన్ మార్కెట్‌లో బంగారం డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు బంగారం ధరలు మారుతుంటాయి. దేశంలో కూడా ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Price) 10 గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 440 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 370 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 450 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 80 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 80 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 2 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 9 వందలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల వంద రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల వంద రూపాయలుగా ఉంది. అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,600 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, కోల్‌కతాలో రూ.61,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.65,500 ఉండగా, కేరళలో రూ.65,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, విజయవాడలో రూ.65,500 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

click me!