ఎస్‌బి‌ఐతో టైటాన్‌ ఒప్పందం.. యోనోతో ఇక లేటెస్ట్ వాచులు కొనేయొచ్చు..

By Sandra Ashok KumarFirst Published Sep 17, 2020, 12:39 PM IST
Highlights

కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్  పాయింట్‌ ఆఫ్‌ సేల్ ‌(పీవోఎస్‌) మెషిన్‌ వద్ద ఎలాంటి డెబిట్‌ కార్డు లేదా స్వైపింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండా షాపింగ్ చేయవచ్చు.   ప్రముఖ గడియారాల సంస్థ టైటాన్ కొత్తగా ఐదు వాచులను భారతదేశంలో విడుదల చేసింది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్  కోసం వాచ్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్ యోనోతో టైటాన్‌ వాచులు కొనొచ్చు.  ఎలా అనుకుంటున్నారా  కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్  పాయింట్‌ ఆఫ్‌ సేల్ ‌(పీవోఎస్‌) మెషిన్‌ వద్ద ఎలాంటి డెబిట్‌ కార్డు లేదా స్వైపింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండా షాపింగ్ చేయవచ్చు.  

ప్రముఖ గడియారాల సంస్థ టైటాన్ కొత్తగా ఐదు వాచులను భారతదేశంలో విడుదల చేసింది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్  కోసం వాచ్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పేమెంట్  చేయడానికి వినియోగదారులు కాంటాక్ట్‌లెస్ పేమెంట్  పీవోఎస్ యంత్రాలపై  టైటాన్ పే పై నొక్కవచ్చు.

ఈ అవకాశం ఎస్‌బి‌ఐ బ్యాంక్ కార్డుదారులకు మాత్రమే పని చేస్తుంది. పిన్ ఎంటర్ చేయకుండా రూ. 2,000  పేమెంట్ చేయవచ్చు, అయితే పేమెంట్ లకు పిన్ కోడ్ మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టైటాన్ కంపెనీ పురుషుల కోసం మూడు కొత్త వాచిలను, మహిళల కోసం రెండు వాచిలను ప్రవేశపెట్టింది.

also read 

పురుషుల వాచ్ ధర రూ. 2,995, రూ. 3,995 ఇంకా రూ. 5,995. ఈ గడియారాలు నలుపు, గోధుమ రంగు బెల్ట్ పట్టీలు, రౌండ్ డయల్‌లతో వస్తాయి. ప్రతి వాచ్ చాలా ప్రీమియం డిజైన్ తో, ఫిజికల్ బటన్స్ తో వస్తుంది. మహిళల గడియారాల ధర రూ. 3,895, రూ. 4,395. గోధుమ, నలుపు లెదర్ బెల్టుతో వస్తాయి.

ఈ గడియారాలన్నీ టైటాన్ ఇండియా వెబ్‌సైట్‌లో కొనడానికి అందుబాటులో ఉన్నాయి. వాచ్ స్ట్రాప్ లో సురక్షితమైన సర్టిఫైడ్ నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సి) చిప్‌ను పొందుపరచడం ద్వారా ఎస్‌బిఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్ల కోసం కొత్త పేమెంట్ సిస్టం ప్రవేశపెట్టారు.

కొత్త టైటాన్ పే ఫంక్షనాలిటీ యోనో ఎస్‌బి‌ఐ, కాంటాక్ట్ లెస్ పిఓఎస్ మెషిన్ అందుబాటులో ఉన్న షాపులు, ప్రదేశాలలో మాత్రమే ఇది పని చేస్తుంది.  కొనుగోలుదారులకు తమ షాపింగ్‌లో నూతన అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు.

ఈ వాచీలు వినియోగదారుల బ్యాంకింగ్ అవసరాలను తీర్చడమే కాక, అభివృద్ధి చెందుతున్న వినియోగదారులకు క్లాసిక్, అధునాతన డిజైన్లతో వస్తుంది ”అని టైటాన్ మేనేజింగ్ డైరెక్టర్ సి కె వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.
 

click me!