
కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవాళ్లు తమ వ్యాపార వివరాలని ప్రభుత్వానికి తెలియజేయడం తప్పనిసరి. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చేదే TIN (Taxpayer Identification Number). వస్తువుల తయారీ, సేవలు, వ్యాపారం.. ఏదైనా సరే TIN నెంబర్ తీసుకోవాలి. ప్రభుత్వానికి నిజాయితీగా పన్నులు కడుతున్నామని చెప్పుకునేందుకు ఇదొక గుర్తింపు లాంటిదన్న మాట. ఉత్పత్తిదారులు, ఏజెంట్లు, వ్యాపారులు, ఎగుమతి చేసేవాళ్లు.. ఇలా వ్యాపారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
TIN నెంబర్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఫోటో, కుటుంబ కార్డ్ కాపీ, పాన్ కార్డ్ కాపీ, ఆస్తి పత్రాల కాపీ, అద్దె ఒప్పందం కాపీ లాంటివి అప్లికేషన్ తో పాటు జత చేయాలి. వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చే ఫారం F, ఫారం A లను పూర్తి చేయాలి. మీరు మొదలుపెట్టబోయే వ్యాపారాన్ని బట్టి ఫీజు మారుతుంది. ఈ ఫీజు కోసం వాణిజ్య పన్నుల శాఖ పేరు మీద బ్యాంక్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. ఇప్పటికే TIN నెంబర్ ఉన్న ఇద్దరి వ్యక్తుల సిఫారసు లేఖ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.
మీరు ఇచ్చిన పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత TIN నెంబర్ జారీ చేస్తారు. మీరు దరఖాస్తులో ఇచ్చిన అడ్రస్‌కు 7 రోజుల్లోనే TIN నెంబర్ వచ్చేస్తుంది. ఒక PAN నెంబర్ కి ఒక TIN నెంబరే ఇస్తారు. కాబట్టి ఒక వ్యక్తి ఒకటికి మించి ఎక్కువ TIN నెంబర్లు తీసుకోలేరు.
ఒక TIN నెంబర్ తో చాలా వ్యాపారాలు చేయొచ్చు. కానీ అది ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీదే వ్యాపారం ఉండాలి. ఒకరి పేరు మీద ఉన్న TIN నెంబర్ ని ఉమ్మడి వ్యాపారానికి వాడలేరు. అదే TIN నెంబర్ తో కొత్త వ్యాపారం మొదలుపెడితే వాణిజ్య పన్నుల శాఖకు లెటర్ ద్వారా తెలియజేయాలి అని అధికారులు తెలిపారు. TIN నెంబర్ తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఏజెంట్ల ద్వారా సులభంగా పొందవచ్చు. వ్యాపార సలహాదారులు, MSME ఆఫీసులు, టాన్స్టియా ఆఫీసుల ద్వారా కూడా TIN నెంబర్ తీసుకోవచ్చు.
మీరు ఒకసారి TIN (Tax Identification Number) అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాని స్టేటస్ ని ఈ కింది విధంగా చెక్ చేసుకోవచ్చు.
NSDL వెబ్సైట్ ద్వారా, NSDL TIN వెబ్సైట్ లో ‘Status Track’ ఆప్షన్ ని ఎంచుకోవాలి.
అప్లికేషన్ రకం (పాన్ కార్డ్, TIN, మొదలైనవి) ఎంచుకోవాలి.
మీకు ఇచ్చిన 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.
ఈ నెంబర్ అప్లికేషన్ చేసిన 3 రోజుల తర్వాత వస్తుంది.
NSDL TIN కాల్ సెంటర్ కి 020-27218080 నెంబర్ కి కాల్ చేసి మీ వివరాలు తెలిపి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఒక వేళ మీరు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలుసుకోవాలనుకుంటే ‘NSDLPAN <15 digit acknowledgement number>’ అని టైప్ చేసి 57575 కి SMS పంపించాలి.
TIN చాలా ముఖ్యమైన పన్నులకు సంబంధించిన ఉపయోగాలకు ఉపయోగపడుతుంది.
అన్ని ముఖ్యమైన పన్నుల వివరాలను ఒకే చోట చూసుకోవచ్చు.
TIN తీసుకున్న తర్వాత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆస్తులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
వ్యాపారాలు వాటి వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి TIN అవసరం.
రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీలను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది.