ఈ ఫార్మా స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది..కానీ టార్గెట్ రూ.660 ఫిక్స్ చేశారు..ఓ లుక్కేయండి..

By Krishna AdithyaFirst Published Nov 24, 2022, 9:11 PM IST
Highlights

దీర్ఘకాలికంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఇన్వెస్టర్లకు శుభవార్త, నాట్కో ఫార్మా స్టాక్‌లో ప్రస్తుత బేరిష్‌నెస్‌కు భయపడి, విక్రయించే బదులు స్టాక్‌ను మీ పోర్ట్ ఫోలియోలోనే ఉంచుకోవాలని ఐసిఐసిఐ డైరెక్ట్ సూచించింది.

క్యాన్సర్, హెపటైటిస్ సి లాంటి వ్యాధులకు నివారణ మందులను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీ Natco Pharma ఈ ఏడాది 38 శాతం బలహీనపడింది. అయితే నాట్కో ఫార్మా షేర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 

దీర్ఘకాలికంగా, ఈ స్టాక్ పెట్టుబడిదారుడి పెట్టుబడిని లాంగ్ టర్మ్ రిటర్న్ లో లక్షలను  కోట్లుగా మార్చింది. స్టాక్‌లో ప్రస్తుత బేరిష్‌నెస్‌కు భయపడి, విక్రయించే బదులు స్టాక్‌ను హోల్డ్ లో ఉంచాలని ఐసిఐసిఐ డైరెక్ట్ సంస్థ సూచించింది. ఐసిఐసిఐ డైరెక్ట్ బ్రోకరేజీ సంస్థ పెట్టుబడి కోసం రూ.660 టార్గెట్ ధరను నిర్ణయించింది, అంటే ప్రస్తుత ధర 567 రూపాయల  కంటే దాదాపు 16 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని మార్కెట్ క్యాప్ రూ.10,350.08 కోట్లుగా నిర్ణయించారు. 

నిపుణులు ఈ స్టాక్ ను ఎందుకు హోల్డ్‌ చేయమని సలహా ఇస్తున్నారు..

నాట్కో ఫార్మా కాంప్లెక్స్ జెనరిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. US మార్కెట్‌లో బలమైన ఉనికిని కలిగి ఉంది. కాబట్టి ఈ 39 బ్రాండ్ నేమ్ మందులు భారతదేశంలో క్యాన్సర్ చికిత్స కోసం విక్రయిస్తుంటారు.. ఇది APAI (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్) ను కూడా ఉత్పత్తి చేస్తుంది.

అలాగే నాట్కో ప్రస్తుతం వ్యవసాయ పంటల పెస్టిసైడ్స్ మార్కెట్లో కూడా ప్రవేశించింది. పత్తిలో గులాబీ రంగు పురుగు నుండి పంటలను రక్షించడంలో సహాయపడటానికి ఫెరోమోన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఈ కారణాల వల్ల బ్రోకరేజ్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నాయి.

20 ఏళ్లలో ఇన్వెస్టర్లు మిలయనీర్లు అయ్యారు
ఈ కంపెనీ షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు బంపర్ రిటర్న్స్ పొందారు. నవంబర్ 22, 2022న నాట్కో షేర్ల ధర రూ.4.24. ఇప్పుడు 133 రెట్లు పెరిగి రూ.566.95కి చేరింది. అంటే.. అప్పట్లో ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయలు ఇప్పుడు 1.33 కోట్ల రూపాయలుగా మారాయి. అయితే ఈ ఏడాది కంపెనీ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి.

ఈ ఏడాది జనవరి 17న రూ.942.15గా నమోదై, ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. అమ్మకాల కారణంగా నవంబర్ 14, 2022న ఇది 40 శాతం తగ్గి 52 వారాల రికార్డు కనిష్ట స్థాయి రూ.563కి చేరుకుంది. ప్రస్తుతం రికవరీ కనిపించవచ్చని, స్టాక్ ధర రూ.660కి చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

click me!