Bata India Share Price: మన దేశంలో బ్రాండెడ్ ఫుట్ వేర్ అనగానే గుర్తొచ్చే పేరు బాటా (Bata India), ఫుట్ వేర్ మార్కెట్లో మెజారిటీ వాటా ఉన్నటువంటి బాటా అటు స్టాక్ మార్కెట్లో కూడా మదుపరులకు కూడా కొంగు బంగారం అనే చెప్పాలి.
అవును, ఈ విషయంలో మీరు నమ్మినా నమ్మక పోయినా సరే, బాటా కంపెనీ షేర్లలో కేవలం ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజు మీరు ఒక ఆడి కారు, నగర శివార్లలో ఒక విల్లాకు యజమాని అయి ఉండేవారు.
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ మెంట్ అనేది ఎంతో ఓపికతో చేయాల్సిన పని. బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కొనుగోలు చేసిన తర్వాత నమ్మకంతో ఓపిక పట్టాలి. ఫండమెంటల్స్‌ను పరిశీలించిన తర్వాత పెట్టుబడి పెట్టినట్లయితే, వారు దీర్ఘకాలికంగా మంచి రాబడిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా అదే బాటలో కనిపించే షేరు బాటా ఇండియా లిమిటెడ్ (Bata India Share Price). ఇన్వెస్టర్లకు డబ్బుల వర్షం కురిపించిన షేర్లలో Bata India తాజా ఉదాహరణ. గత 19 ఏళ్లలో ఈ కంపెనీ స్టాక్ ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది. ఈ 19 ఏళ్ల వ్యవధిలో కంపెనీ షేర్ల ధరలు ఏకంగా 14,753% పెరిగాయి.
ఈ కంపెనీ స్టాక్ హిస్టరీ ఏమిటి ?
బాటా ఇండియా షేరు ధర (Bata India Share Price), 2 మే 2003 నాటికి రూ. 11.92 పలికింది. అయితే జూలై 6, 2022న NSEలో రూ. 1770 వరకూ పలుకుతోంది. అంటే, గత 19 ఏళ్లలో, ఈ స్టాక్ ధర ఏకంగా రూ.1758 పెరిగింది. గత ఐదేళ్లలో కూడా ఈ స్టాక్ పనితీరు బుల్లిష్ గానే ఉంది. బాటా షేరు ధర 7 జూలై 2007 నాటికి రూ. 573.65. అప్పటి నుండి, షేరు ధర 209.26% పెరిగింది. అయితే ఈ ఏడాది ఇన్వెస్టర్లకు ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 3 నుంచి ఒక్కో షేరు ధర రూ.85.05 తగ్గింది. అదే సమయంలో, గత ఒక నెల కూడా పెట్టుబడిదారులకు నష్టాలను మిగిల్చింది. ఒక్కో షేరుపై రూ.54.75 తగ్గింది.
లక్ష రూపాయలకు ఎంత రాబడి వచ్చింది?
మే 2, 2003న బాటా షేరు ధర రూ.11.92. అప్పుడు కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టే వ్యక్తి రాబడి ఇప్పుడు రూ.1.48 కోట్లకు పెరిగింది. అయితే ఐదేళ్ల క్రితం ఎవరైతే నమ్మకంతో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారో వారి రాబడి రూ.308900.4కు పెరిగి ఉండేది. అయితే నెలక్రితం ఈ స్టాక్‌పై నమ్మకం ఉంచి లక్ష రూపాయల పెట్టి ఉంటే అది ఇప్పుడు రూ.96,819కి తగ్గుతుంది. అదే సమయంలో ఈ ఏడాది ప్రారంభంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి సొమ్ము కూడా రూ.95208కి తగ్గింది.