ప్రపంచ వాణిజ్యంలో వెలుగుతున్న రూపాయి...అమెరికన్ డాలర్లకు బదులు రూపాయితో వాణిజ్యం చేస్తున్న 64 దేశాలు ఆసక్తి..

By Krishna AdithyaFirst Published Apr 2, 2023, 2:41 PM IST
Highlights

విశ్వ వాణిజ్యంలో భారత్ వెలుగుతోంది. తాజాగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యతో భారత రూపాయి త్వరలో అంతర్జాతీయ కరెన్సీగా మారనుంది! రూపాయిలో వ్యాపారం చేసేందుకు ఇప్పటికే 64 దేశాలు ఆసక్తి చూపడం విశేషం.

ప్రపంచ వేదికపై భారతదేశం ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా వాణిజ్య రంగంలో పెరుగుతున్న ఆధిపత్యం కారణంగా, ఇప్పుడు అనేక దేశాలతో భారత్ రూపాయి కరెన్సీలోనే వాణిజ్యం చేస్తోంది. తాజాగా భారతదేశం,  మలేషియాతో నేరుగా భారతీయ కరెన్సీ అంటే రూపాయిలో వ్యాపారం సాధ్యమవుతుంది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత సంవత్సరం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంతర్జాతీయ వ్యాపారం కోసం రూపాయిని ఉపయోగించుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అనంతరం ఇరు దేశాల మధ్య ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. మిగిలిన కరెన్సీలాగే ఇప్పుడు భారతీయ రూపాయి కూడా రెండు దేశాల మధ్య వాణిజ్యానికి ఉపయోగిస్తున్నట్లు  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  MEA తెలిపింది.

భారత కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రష్యా, శ్రీలంక తర్వాత నాలుగు ఆఫ్రికన్ దేశాలతో సహా చాలా దేశాలు భారత్‌తో అతి త్వరలో రూపాయల్లో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 17 Vostro ఖాతాలు తెరుచుకున్నాయి. ఇతర దేశాలతో రూపాయి మారకంతో వ్యాపారం చేయడానికి ఈ ఖాతా తప్పనిసరి. ఇదొక్కటే కాదు, జర్మనీ-ఇజ్రాయెల్‌తో సహా 64 దేశాలు భారత్‌తో రూపాయలలో వాణిజ్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నాయి. 30 దేశాలతో భారత్ వ్యాపారం రూపాయితో ప్రారంభమైతే, రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారుతుంది.

డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చర్యలు 
విదేశీ వాణిజ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం తీసుకున్న చర్యలు విజయం సాధిస్తున్నాయి.  జూలై 2022లో, RBI విదేశాల నుండి ఆసక్తిని ఆకర్షించడానికి, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి రూపాయలలో వాణిజ్య పరిష్కార విధానాన్ని ప్రతిపాదించింది. రష్యాతో రూపాయి వాణిజ్యం ప్రారంభమైన తర్వాత, దేశంలో 17 వోస్ట్రో ఖాతాలు తెరుచుకున్నాయి. జర్మనీ, ఇజ్రాయెల్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సహా 64 దేశాలు రూపాయి ద్వారా వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపాయి.

Vostro ఖాతా అంటే ఏంటి..?
మలేషియాతో భారతీయ రూపాయి ద్వారా వ్యాపారం చేయడానికి Vostro ఖాతా అవసరం అవుతుంది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా (IIBM, దాని ఇండియన్ అసోసియేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)తో కలిసి ప్రత్యేక ఖాతా తెరవాలని నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీన్ని Vostro ఖాతా అంటారు.  ఈ ఖాతా ద్వారా మాత్రమే మలేషియా-భారత్ మధ్య వ్యాపారం రూపాయి చెల్లింపులు సాధ్యం అవుతాయి. 

అంతర్జాతీయంగా రూపాయి టర్నోవర్ పెరిగింది
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికాతో పాటు అనేక పాశ్చాత్య దేశాలు రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీని తరువాత, భారతదేశం వాణిజ్యం కోసం రూపాయిని ప్రోత్సహించడం ప్రారంభించింది. ఇందుకోసం 2022 జూలైలో అంతర్జాతీయంగా రూపాయిని ఉపయోగించుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. డాలర్‌పై భారతదేశం, ఇతర ప్రపంచం ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం ఈ చర్య తీసుకుంది. దీనివల్ల దేశంపై విదేశీ మారకద్రవ్య నిల్వల భారం తగ్గడంతో పాటు ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో కూడా దోహదపడుతుంది.

click me!