ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ సంస్థ థర్డ్‌వేర్‌ను కొనుగోలు చేయనుంది. పూర్తి నగదు రూపంలో ఉండే ఈ డీల్ కోసం 42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 322 కోట్లు) వెచ్చించనుంది.
సాఫ్ట్‌వేర్ జెయింట్ టెక్ మహీంద్రా తన పరిధిని మరింత విస్తరించుకోనుంది. ముంబైకి చెందిన ప్రముఖ టెక్ కంపెనీ థర్డ్‌వేర్ సొల్యూషన్స్‌ను టేకోవర్ చేయనుంది. ఈ కంపెనీకి చెందిన వంద శాతం స్టేక్స్‌ను కొనుగోలు చేయనుంది. దీనికోసం 42 మిలియన్ డాలర్లను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు టెక్ మహీంద్రా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అనంతరం ఈ టేకోవర్ వివరాలను వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ముంబైకి చెందిన ఐటీ సర్వీసెస్ కంపెనీ థర్డ్‌వేర్ సొల్యూషన్స్. 1995లో ఏర్పాటైన సంస్థ ఇది. 850 మందికి పైగా ఉద్యోగులు ఇందులో పని చేస్తోన్నారు. ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఎంటర్‌ప్రైస్ పెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, రోబొటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇండస్ట్రీయల్ ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ సహా సాఫ్ట్‌వేర్ కంపెనీలకు బిజినెస్ అప్లికేషన్స్, కన్సల్టింగ్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ సేవలను అందిస్తోంది. ఎర్న్ అవుట్స్‌తో కలుపుకొని ఈ కంపెనీని వందశాతం మేర టేకోవర్ చేయాలని టెక్ మహీంద్రా నిర్ణయించింది.
undefined
ఈ సంవత్సరం మే 31వ తేదీ నాటికి టేకోవర్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని టెక్ మహీంద్రా తెలిపింది. మూడు సంవత్సరాలుగా థర్డ్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ నిలకడగా నికర లాభాలను ఆర్జిస్తూ వస్తోంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో థర్డ్‌వేర్ సొల్యూషన్స్ 210.62 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 215.56 కోట్ల రూపాయలు, 2018-19లో 225.44 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 31వ తేదీ నాటికి 226.5 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకుంది. కాగా- శుక్రవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్‌లో టెక్ మహీంద్రా షేర్లు కొంత పుంజుకోగలిగాయి. 0.13 శాతం మేర మెరుగుపడ్డాయి. ఒక్కో షేర్ ధర 1,486.95 రూపాయల వద్ద ముగిసింది. కొద్దిరోజులుగా పాతాళానికి పడుతూ వస్తోన్న షేర్ మార్కెట్.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ కొంతమేర నిలకడగా ఉంటోంది.