Tech Mahindra: నిరుద్యోగులకు టెక్ మహీంద్రా అదిరిపోయే ఆఫర్.. !

By Rajesh KarampooriFirst Published Apr 26, 2024, 9:55 AM IST
Highlights

Tech Mahindra: ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాకు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో రూ.661 కోట్ల నికర లాభం వచ్చిందనీ, కానీ ఏడాది లెక్కన ఇది 41శాతం క్షీణత అని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 

Tech Mahindra: ప్రముఖ ఐటీ టెక్ మహీంద్రా గురువారం ఏడాది( Q4FY24) ఫలితాలను విడుదల చేసింది. అంటే 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి )లో కంపెనీ నికర లాభం సంవత్సరానికి 41% పడిపోయి ₹661 కోట్లకు చేరుకుందని తెలిపింది.

గత త్రైమాసికంలో రూ.1,117.70 కోట్ల లాభం వచ్చింది. 2023 నాలుగో త్రైమాసికంలో  కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,46,250 నుంచి 1,45,455లకు పడిపోయింది. అలా చూస్తే.. 2024 నాలుగో త్రైమాసికంలో ఒక శాతం నష్టం వచ్చినట్టు తెలిపింది.  

 టెక్ మహీంద్రా ఆదాయం ₹ 12,871 కోట్లు

అయితే టెక్ మహీంద్రా కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం వార్షిక ప్రాతిపదికన 6.2% పెరిగి ₹ 12,871.3 కోట్లకు చేరుకుంది. గత త్రైమాసికంలో (Q3FY24) కంపెనీ ఆదాయం ₹13,101.3 కోట్లు. అంటే మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 1.8% తగ్గింది. 

నిరుద్యోగులకు శుభవార్త..

ఈ ఏడాది 6000 మంది ఫ్రెషర్లను కంపెనీ నియమించుకోనుంది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టెక్ మహీంద్రా మొత్తం ఉద్యోగుల సంఖ్య 795 తగ్గింది. అదే సమయంలో FY24 లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6,945 తగ్గింది.

కంపెనీ మార్కెట్ క్యాపిటల్

గురువారం నాడు 0.43% లాభంతో రూ.1,190.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.16 లక్షల కోట్లు. గత నెలలో కంపెనీ షేర్లు 5.07% క్షీణించాయి. గత ఆరు నెలల్లో షేరు 6.75% పెరిగింది. 

click me!