Tata Sons: టాటా డిజిటల్‌కు భారీగా పెట్టుబడులు.. ఓకేసారి 5 వేల కోట్లు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 11, 2022, 09:28 AM IST
Tata Sons: టాటా డిజిటల్‌కు భారీగా పెట్టుబడులు.. ఓకేసారి 5 వేల కోట్లు..!

సారాంశం

అమెజాన్‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌లకు పోటీగా తెచ్చిన ఈ–కామర్స్ కంపెనీ టాటా డిజిటల్‌‌‌‌లో  టాటా సన్స్ భారీగా పెట్టుబడులు పెడుతోంది.  తాజాగా రూ. 5,882 కోట్లను ఒకే ట్రాన్సాక్షన్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని చూడొచ్చు. దీంతో  2021–22లో టాటా డిజిటల్‌‌‌‌లో మొత్తం రూ. 11,872 కోట్లను ​టాటా సన్స్ ఇన్వెస్ట్ చేసినట్టు అయ్యింది. టాటా సన్స్ ఈ–కామర్స్​ కంపెనీలో ఒకే ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ఇంతలా ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి.  

దేశీయ దిగ్గజ కంపెనీ టాటా ఈ కామర్స్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే టాటాకు ఈ కామర్స్ సైట్లు ఉన్నాయి. తాజాగా కొత్తగా మరో యాప్ ఓపెన్ చేశారు. దానిని మరింత డెవలప్ చేయడంపై కంపెనీ ఫోకస్ చేసింది. ఇందుకోసం భారీగా పెట్టుబడి పెట్టింది. టాటా డిజిటల్‌‌‌‌లో టాటా సన్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. రూ. 5,882 కోట్లను ఒకే ట్రాన్సాక్షన్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేసింది. 2021-22 లో టాటా డిజిటల్‌‌‌‌లో మొత్తం రూ. 11,872 కోట్లను ​ టాటా సన్స్ ఇన్వెస్ట్ చేసింది.

టాటా సన్స్ ఈ-కామర్స్​ కంపెనీలో ఒక వార్షిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి. టాటా డిజిటల్‌‌‌‌ తాజాగా టాటా న్యూ యాప్‌‌‌‌ను తీసుకొచ్చింది. క్రోమా, టాటా క్లిక్‌‌‌‌, బిగ్‌‌‌‌బాస్కెట్‌‌‌‌, 1ఎంజీ వంటి కంపెనీలు ఈ కంపెనీకి సబ్సిడరీలుగా ఉంటాయి. టాటా సన్స్‌‌‌‌కు రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్న రూ. 5,882 కోట్ల విలువైన ఫుల్లీ పెయిడప్‌‌‌‌ ఈక్విటీ షేర్లను ఇష్యూ చేయడానికి టాటా డిజిటల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నెల 7వ తేదీన టాటా న్యూ యాప్‌‌‌‌ను కంపెనీ తీసుకొచ్చింది.

2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ.5,990 కోట్లను టాటా డిజిటల్‌‌‌‌లో టాటా సన్స్ ఇన్వెస్ట్ చేసింది. మార్చి 31వ తేదీ నాటికి ఉన్న సమాచారం మేరకు టాటా డిజిటల్‌‌‌‌ ఆథరైజ్డ్ క్యాపిటల్‌‌‌‌ను రూ. 11,000 నుంచి రూ. 15,000 కోట్లకు పెంచింది. టాటా డిజిటల్‌‌‌‌కు ఉన్న అప్పులను తీర్చడానికి, కార్పొరేట్ అవసరాలకు ఈ క్యాపిటల్‌‌‌‌ను వాడతారు.ఒకే సారి రూ. 5,882 కోట్లను టాటా డిజిటల్‌‌‌‌లో టాటా సన్‌‌‌‌ ఇన్వెస్ట్ చేసింది. ఈ కంపెనీ ఏర్పడినప్పటి నుంచి చేసిన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లలో ఇది సగం కావడం విశేషం అని అల్టో ఇన్ఫో ఫౌండర్‌‌‌‌‌‌‌‌ మోహిత్ యాదవ్‌‌‌‌ అన్నారు. ఈ-కామర్స్‌‌ సెగ్మెంట్‌‌పై సీరియస్‌‌గా ఉన్నామనే సంకేతాలను టాటా గ్రూప్‌‌ ఇస్తోంది. సో మరీ ప్లిప్ కార్డ్, అమెజాన్.. ఇటీవల వచ్చిన ఎస్ షాప్, మీ షో లాంటి ఈ కామర్స్ నుంచి పోటీ ఎలా తట్టుకుంటుందో చూడాలీ మరీ.

 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు