
TATA IPL 2023 అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ అయిన JioCinema రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ సాధించింది. ఐపీఎల్ తో జియో సినిమా ఓటీటీ మార్కెట్లో బ్లాక్ బస్టర్ అరంగేట్రం చేసింది. JioCinemaలో మొదటి వారాంతంలో వీక్షకుల సంఖ్య డిజిటల్‌లో TATA IPL చివరి సీజన్ రికార్డ్ ను అధిగమించింది. ఇది ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 కంటే కూడా ఎక్కువ ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదు చేయడం గమనార్హం.
ఒక్కో మ్యాచ్‌కి ఒక్కో వీక్షకుడు సగటున 57 నిమిషాలు చూడటంతో సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా JioCinema ఫ్యాన్-సెంట్రిక్ ప్రెజెంటేషన్‌కు ప్రతీ ఒక్కరూ అతుక్కుపోయారు. గత సీజన్ మొదటి వారాంతంతో పోలిస్తే JioCinemaలో ఒక్కో మ్యాచ్‌కి ఒక్కో వీక్షకుడి సమయం 60 శాతం పెరిగింది. జియో సినిమా మొత్తం 147 కోట్ల వ్యూయర్ షిప్ సాధించింది.
“ఈ నెంబర్స్ అసాధారణమైనవని, దేశంలో డిజిటల్ విప్లవం వ్యాప్తికి సాక్ష్యమని ఈ వారం JioCinema పనితీరు అద్భుతం, ”అని Viacom18 స్పోర్ట్స్ CEO అనిల్ జయరాజ్ అన్నారు. “టాటా IPL 2023 ప్రారంభ వారాంతంలో భోజ్‌పురి, పంజాబీ, ఒరియాతో సహా లీగ్‌ను మొదటిసారి ప్రాంతీయ భాషల్లో క్రికెట్ ప్రసారం చేయడంతో JioCinema చూసేందుకు ఆసక్తి పెరిగిందని ఆయన అన్నారు.
తొలిమ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగగా, JioCinema యాప్ 1.6 కోట్ల డౌన్ లోడ్స్ సాధించింది. అంతేకాదు Jio Cinema 5 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లు సాధించింది. ఒకే రోజులో అత్యధికంగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌గా రికార్డ్ సాధించింది. 4K ఫీడ్, 12-భాషల్లో కవరేజ్, 16 ప్రత్యేక ఫీడ్‌లు, హైప్ మోడ్ మల్టీ-క్యామ్ సెటప్ వంటి ప్రత్యేక ఫీచర్లను జియో సినిమాలో ప్రత్యేకంగా చెప్పవచ్చు.
Jio STB, Apple TV, Amazon Firestick, OnePlus TV, Sony, Samsung, LG Xiaomiతో సహా 500 కంటే ఎక్కువ OEM CTV ప్లాట్‌ఫారమ్‌లతో JioCinema యాప్ అందుబాటులో ఉంది. వీటిలో 4Kలో క్వాలిటీతో మ్యాచులను చూసే వీలుంది. అంతేకాదు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, పంజాబీ, ఒరియా, బెంగాలీ, తమిళం, తెలుగు, మలయాళం కన్నడతో సహా 12 భాషల్లో JioCinemaలో వీక్షకులకు అందుబాటులో ఉంది. . వీక్షకులకు వారి ఇష్టమైన క్రీడను ఆస్వాదించడానికి కొత్త మార్గాన్ని కల్పించింది.
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ 2023 ఎడిషన్‌కు ముందు JioCinemaతో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. గ్లోబల్ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, భారతదేశం అత్యంత ప్రసిద్ధ క్రికెట్ కెప్టెన్ నాలుగు సార్లు IPL విజేత MS ధోని, ప్రపంచ నం. 1 T20 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తమ ప్రపంచ స్థాయి, డిజిటల్-ఫస్ట్ TATA IPL ప్రదర్శనను విస్తరించేందుకు JioCinemaతో బ్రాండ్ అంబాసిడర్లుగా చేతులు కలిపారు.