బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ అనుసంధానించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకుంటే డబ్బు మాయం..

By Sandra Ashok KumarFirst Published Nov 14, 2020, 5:03 PM IST
Highlights

హ్యాకర్లు కస్టమర్లకు నకిలీ కాల్స్ చేసి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ చేయమని అడుగుతారు. ఈ సమయంలో హ్యాకర్లు లేదా దుండగులు బ్యాంక్ అధికారులుగా మాట్లాడి, కస్టమర్ల నుండి బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పొందేలా చేస్తారు. 

బ్యాంకు కస్టమర్ల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచనలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో  లింక్ చేయడానికి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతులు ఉన్నాయి.

ఆధార్‌ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానించేటప్పుడు, చాలా మంది కొన్ని పొరపాటు చేస్తుంటారు, అలాంటప్పుడు మీ ఖాతాలో డబ్బు ఖాళీ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించండి. 

అజాగ్రత్త, అనుకోకుండా చేసే తప్పుల వల్ల ఖాతాదారులు మోసానికి గురయ్యే అవకాశం ఉంది. హ్యాకర్లు కస్టమర్లకు నకిలీ కాల్స్ చేసి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ చేయమని అడుగుతారు.

also read 

ఈ సమయంలో హ్యాకర్లు లేదా దుండగులు బ్యాంక్ అధికారులుగా మాట్లాడి, కస్టమర్ల నుండి బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పొందేలా చేస్తారు. తరువాత మీ ఖాతా నుండి డబ్బు కాజేస్తారు.

ఇటువంటి పరిస్థితిలో మీరు ఎప్పుడూ ఇలాంటి నకిలీ కాల్స్ వలలో పడకూడదు. సంబంధిత బ్యాంకు, అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్‌తో లింక్ చేయండి లేదా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి స్వయంగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయండి.

ఏ బ్యాంకు కూడా కస్టమర్లను పిలిచి ఆధార్ తో బ్యాంక్ ఖాతాను లింక్ చేయమని అడగదు. ఇలాంటి మోసాలను నివారించడానికి, ఎవరైనా మీ ఖాతా వివరాలు లేదా ఏ‌టి‌ఎం పాస్‌వర్డ్ అడిగితే, అస్సలు ఇవ్వకండి. మీకు అలాంటి కాల్ వస్తే వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి.

click me!